బ్రేకింగ్; జగన్ దెబ్బ, ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దొరికిపోయిన టీడీపీ…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. దీనిపై విచారణకు ఆమోద ముద్ర వేసింది. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. ముందుగా బినామీల మీద అనుమానం ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారించింది. వారిని టార్గెట్ చేస్తూ విచారణ వేగవంతం చేసింది.

ఈ నేపధ్యంలో అసైన్డ్ భూములలో జరిగిన అక్రమాలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. తనను బెదిరించి భూములు లాక్కున్నారని వెంకటపాలెం కి చెందిన మహిళా రైతు బుజ్జమ్మ కేసు పెట్టారు. తనకు ఉన్న 99 సెంట్ల భూమిని లాక్కున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. దీనితో మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేసారు.

వారిపై సెక్షన్ 420, 506, 120/బి, ఎస్సీ, అట్రాసిటి కింద కేసులు నమోదు చేసారు. మరికొందరు తెలుగుదేశం నేతల మీద కేసులు నమోదు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనిపై స్పందించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తమ మీద అక్రమ కేసులు పెట్టారని, కక్షతోనే ఈ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అయితే వీరిని అధికారులు విచారణకు పిలుస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news