ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలితో ఆ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉన్న అమరావతి మహిళలు అయితే ఈ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని తాజా పరిస్థితులు చెప్తున్నాయి. రాజధాని మార్చవద్దని వేలాది మంది మహిళలు రోడ్డు ఎక్కడం ఇప్పుడు చర్చనీయంశంగా మారి౦ది.
అయితే ఈ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా మారింది. శుక్రవారం మహిళల విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారి విషయంలో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కొట్టడం, ఈడ్చేయడం వంటివి వివాదాస్పదంగా మారాయి. దీనిపై కేంద్రం ఆగ్రహ౦ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ నుంచి వివరాలు సేకరించింది.
శుక్రవారం ఉదయం మహిళలు కనకదుర్గ గుడికి వెళ్లి సారే సమర్పించాలని భావించారు. కాని వారికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డీజీపీ గౌతం సవాంగ్ కి ఫోన్ చేసి అనుమతి ఇవ్వాలని, అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేసారో తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు సమాచారం. ఇక జాతీయ మహిళా కమీషన్ కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉందని సమాచారం.