తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ ఇలా చేస్తుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు పేరు పెట్టడం చాలా సులభమైన పని అని, అది కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా పనిచేయాలని డీఎంకే నేతలు అన్నారు.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఎంజీఆర్ పేరు పెడుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఇవాళ తమిళనాడులోని కాంచీపురం (కంచి)లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు గ్రేట్ ఎంజీఆర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ తమిళనాడు బహిరంగ సభతో ఎన్‌డీయే కూటమి ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఆయన కంచిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో మోడీ పై నిర్ణయాన్ని వెల్లడించారు.
అయితే లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఇలా పేరు మార్చడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ ఇలా చేస్తుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు పేరు పెట్టడం చాలా సులభమైన పని అని, అది కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా పనిచేయాలని డీఎంకే నేతలు అన్నారు. తమిళ ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా కావేరీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని డీఎంకే డిమాండ్ చేసింది.
అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఎంజీఆర్ పేరు పెట్టడాన్ని అన్నాడీఎంకే రెబల్ నేత టీటీవీ దినకరన్ స్వాగతించారు. కానీ ఈ సమయంలో పేరు ఎందుకు పెట్టారని ఆయన విమర్శించారు. ఇదంతా ఎన్నికల కోసమేనని ఆయన అన్నారు. కాగా మరోవైపు మోడీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి తమిళనాడుకు వచ్చే విమానాల్లో తమిళ భాషలోనే ప్రకటనలు చేసేలా చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.