మరో వివాదంలో చిక్కుకున్న చంద్రబాబు, లోకేశ్.. అదే క్యాష్ ఫర్ ట్వీట్..!

-

సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయించడం. అది కూడా తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని వారితో.. ఇతర రాష్ట్రాల వారితో డబ్బులిచ్చి ట్వీట్లు చేయించి అడ్డంగా దొరికిపోయాడు లోకేశ్.

ఇప్పటికే ఓటుకు నోటు, డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే క్యాష్ ఫర్ ట్వీట్. దీని గురించి మాట్లాడుకునే ముందు మనం ఓసారి డేటా చోరీ కేసు గురించి మాట్లాడుకోవాలి.

ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీకి చెందిన సేవ్ మిత్ర అనే యాప్ లో స్టోర్ చేసింది. అయితే.. ఏపీ ప్రభుత్వమే ఐటీ గ్రిడ్ అనే సంస్థకు ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను అప్పగించిందని ఆరోపణలు ఎదుర్కుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఆ డేటాను ఉపయోగించుకొని గెలవాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పజెప్పింది ఏపీ ప్రభుత్వం. దీనిపై తెలంగాణలో కేసు నమోదు అయింది. తెలంగాణ పోలీసులు దానిపై విచారిస్తున్నారు. విజిల్ బ్లోయర్ లోకేశ్వర్ రెడ్డి డేటా చోరీపై కేసు వేశారు.

కట్ చేస్తే.. డేటా చోరీ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ కొత్త పాట పాడుతున్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుతూ తెలంగాణకు ఏపీ పోలీసులను పంపించి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కుంభకోణానికి
తెర లేపారు చంద్రబాబు అండ్ లోకేశ్. అదే క్యాష్ ఫర్ ట్వీట్.

క్యాష్ ఫర్ ట్వీట్ అంటే?

సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయించడం. అది కూడా తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని వారితో.. ఇతర రాష్ట్రాల వారితో డబ్బులిచ్చి ట్వీట్లు చేయించి అడ్డంగా దొరికిపోయాడు లోకేశ్. దానికి ఆధారం మీరు పైన చూస్తున్న ఫోటో. దీనిపై టీఆర్ఎస్ కు అనుమానం వచ్చి వివరాలు సేకరించగా.. కావాలని.. చేస్తున్న ఎదురుదాడిగా అర్థమయిపోయింది.

లోకేశ్ ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. వేల ట్వీట్లు.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. అవి కూడా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్లు చేసిన ట్వీట్లు. టీఎస్ గౌట్ స్టీల్స్ డేలా హ్యాష్ టాగ్ పేరుతో లోకేశ్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం.. వాటికి వేరే రాష్ట్రాల వాళ్లు రిప్లయిలు ఇవ్వడం.. ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేశ్ ఎదురుదాడి చేయిస్తున్నారని అర్థమవుతోంది.

అయితే.. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైం డిపార్ట్ మెంట్, ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యాష్ ఫర్ ట్వీట్ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version