ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ ఆయన ప్రత్యేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి నానా కష్టాలు పడుతున్నారు. అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆయన భావిస్తూ అన్ని పార్టీలతో కలిసి అమరావతి ఉద్యమాన్ని ముందుకి తీసుకువెళ్తున్నారు.
జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రజల మద్దతు కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళారు. దీనితో ఆయనకు అక్కడ ప్రజల్లో ఘన స్వాగతం లభించింది. అది అలా ఉంటే చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. చీటికి మాటికి బయటకువచ్చే ఉద్యోగులు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
ఎన్జీవోలు ఎక్కడ ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మరో వ్యాఖ్య చేసారు. జనసేన, బిజెపి పొత్తు పెట్టుకోవడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే రెండు పార్టీలు కలవడం మంచి పరిణామం అంటూ తన మనసులో మాట బయటపెట్టారు. ఆ రెండు పార్టీల పొత్తు వెనుక చంద్రబాబు ఉన్నారనే విమర్శలు వైసీపీ నేతలు ఇప్పటికే చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు తన మానసులో మాట బయటపెట్టడంతో వైసీపీ నేతలు ఆయనపై విరుచుకుపడే అవకాశం ఉంది.