ఏపీలో పొత్తులపై ఇంకా ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్‌ని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవ్వడానికి చూస్తున్నాయి. కానీ అందులో టిడిపి పరిస్తితి అయోమయంగా ఉంది. అసలు చంద్రబాబు పరిస్తితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఉంది. అంటే పొత్తు పెట్టుకుంటే జనసేన-బిజేపితో పొత్తు పెట్టుకోవాలి..లేదంటే పొత్తు ఉండదు. అయితే ఒక్క జనసేనతో పొత్తు ఇబ్బంది ఉండదు. కానీ బిజేపితో పొత్తు రిస్క్.
ఎందుకంటే బిజేపి..కేంద్రంలో అధికారంలో ఉంది..ఆ పార్టీకి ఏపీలో బలం శూన్యం. కానీ ఆ పార్టీ చెప్పినట్లే బాబు నడుచుకోవాలి. పైగా ఏపీకి పెద్దగా న్యాయం చేయని బిజేపిపై ప్రజలు కోపంతో ఉన్నారు.ఇక బిజేపితో కలిస్తే టిడిపికి ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు దూరమవుతాయి. ఇలా ఎటు చూసుకున్న బిజేపితో పొత్తు టిడిపికి నష్టమే. పోనీ జనసేన ఒక్కటే కలిసొస్తుందా? అంటే అదీ లేదు. పవన్ ఖచ్చితంగా బిజేపితో పొత్తు ఉంటుందనే చెబుతున్నారు. ఆయన బిజేపిని వదిలి వచ్చేలా లేరు. అలాంటప్పుడు టిడిపి ఎవరితో పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేయాలి అది జరిగిన నష్టమే. ఓట్లు చీలిపోతాయి. మళ్ళీ వైసీపీకి లాభం.
ఇలా ఎటు చూసిన బాబుకు ఇబ్బందే. అయితే ఇటీవలే ఢిల్లీకి వెళ్ళి కేంద్రంలోని పెద్దలని కలిసొచ్చిన పవన్..ఇప్పుడు బాబుతో కూడా భేటీ అవుతారని తెలిసింది. దీంతో పొత్తులపై చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఎటు చూసుకున్న బిజేపితో కలవకుండా ఉండటమే టిడిపికి సేఫ్ అని అంటున్నారు. అంటే పవన్..బిజేపిని వదిలి రావాలి..టిడిపి-జనసేన కలిస్తే ప్లస్ అవుతుంది..బిజేపి కలిస్తే మైనస్ అవుతుంది.
ఇక ఏవి వద్దు అనుకుంటే బాబు ఒంటరిగా వెళ్ళే ప్లాన్ చేయాలి..లేదంటే కమ్యూనిస్టులని కలుపుకుని వెళ్ళాలి. చూడాలి మరి పొత్తులపై బాబు వ్యూహం ఎలా ఉంటుందో.