అయిపాయ్‌.. సూప‌ర్ సిక్స్ ఈ ఏడాది లేన‌ట్లే…!

-

సూప‌ర్ సిక్స్‌తో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటామ‌ని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ప్రకటనలు నిజ‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. వైసిపి పాలనలో సంక్షేమ పథకాల అమలు పేరుతో లూఠి జరిగిందని ఆరోపించిన చంద్ర‌బాబు ప‌థ‌కాల‌కు డ‌బ్బులు లేవ‌ని చెప్ప‌డమే అందుకు కార‌ణం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం, 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటే నెలకు 1500 రూపాయలు సాయం, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మ‌హిళ‌లు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ.. ఇలా హామీలు ఇచ్చేశారు.

తాను జగన్ మాదిరిగా కాదు, సంపద సృష్టించి అందరికీ పంచుతాను.. అంటూ ప్రజలకు హామీలు ఇచ్చారు. ప్రజలు కూడా చంద్రబాబు మాటలను నమ్మారు. కానీ ఇప్పుడు ఆయ‌న మాట మార్చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రకటనలు చేస్తూ జగన్ చేసిన అప్పులు చూస్తుంటే ఆందోళనగా ఉందని అంటున్నారు.ఇదే టైమ్‌లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేమంటూ ప‌రోక్షంగా ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారాయ‌న‌.

కూటమి ప్రభుత్వం ఏర్ప‌డి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేశాక ఏకంగా ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. ఇక పథకాల అమలుతో పాటు అభివృద్ధిని కూడా ప‌రుగులు పెట్టిస్తామ‌ని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడిప్పుడే క్లారిటీగా మాట్లాడుతున్నారు. అసలు విషయాలను వెల్లడిస్తున్నారు. పథకాలు అమలు చేయకముందే జగన్ సర్కార్ వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు చంద్రబాబు.

వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ జగన్ సర్కార్ ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.పెద్ద ఎత్తున అప్పులే ఉన్నాయ‌ని ఎక్క‌డా డ‌బ్బులు లేవ‌ని చెప్తూ తాను ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని బాంబు పేలుస్తున్నారు. ఇక‌ పథకాలు అమలు చేయడం కష్టమని చేతులెత్తేశారు. దీంతో ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్ళు చల్లిన‌ట్ల‌యింది.హామీలు ఇప్ప‌ట్లో అమ‌లు కావ‌ని చెప్పేయ‌డంతో ఉసూరుమంటున్నారు.

చంద్రబాబు హామీల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. వైసిపి సోషల్ మీడియా విభాగం దీనిపై పెద్ద ఎత్తున కామెడీ మీమ్స్ జత చేసి ట్రోల్స్ స్టార్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. పథకాల విషయంలో చంద్రబాబు ఎప్పుడు మాట మీద ఉన్నారు కదా? అని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. చేయ‌లేన‌ప్పుడు చెప్ప‌న‌డం ఎందుక‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. చెప్పిన‌వే కాకుండా చెప్ప‌నివి కూడా చేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌దేన‌ని అంటున్నారు. అలాంటి నేత‌ను కాద‌ని చంద్ర‌బాబును ఎన్నుకున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు అస‌లు విష‌యం బోధ‌ప‌డుతోంద‌ని అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news