భీమవరంలో డమ్మీ: పవన్ కళ్ళలో ఆనందం చూడటానికేనా బాబు…

చంద్రబాబు…పవన్ కల్యాణ్‌ని మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలాగో సింగిల్‌గా జగన్‌ని ఎదురుకోవడం బాబు వల్ల కావడం లేదు…కాబట్టి పవన్ సపోర్ట్ ఉంటే కనీసం కొంతవరకు జగన్‌ని ఢీకొట్టవచ్చని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవన్ కూడా ఒంటరిగా సాధించేది లేదు..కనీసం టి‌డి‌పితో కలిస్తే నాలుగు సీట్లు అయిన వస్తాయని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దరి మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

జగన్‌ని ఎదుర్కోవడానికి ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు అర్ధమవుతుంది. అయితే అధికారికంగా ఇప్పుడే కలవకపోయినా, ఈలోపు అంతర్గతంగా ఒకే అండర్ స్టాండింగ్‌తో ముందేకెళ్లెలా ఉన్నారు. అందుకే అనుకుంటా చంద్రబాబు సైతం పవన్ కోసం కొన్ని త్యాగాలు కూడా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని మార్చేసి కొత్త ఇంచార్జ్‌లని నియమించారు. ఈ క్రమంలోనే పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భీమవరం స్థానంలో కూడా ఇంచార్జ్ పెట్టారు.

ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న తోట సీతారామలక్ష్మిని ఇంచార్జ్‌గా నియమించారు. ఇక ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులని సైడ్ చేశారు. అయితే ఇలా సడన్‌గా ఇంచార్జ్‌ని మార్చడం వెనుక కారణం లేకపోలేదు. నెక్స్ట్ జనసేనతో పొత్తు ఉంటే పవన్ కల్యాణ్ భీమవరంలోనే పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కాకపోయినా పొత్తులో భాగంగా భీమవరం సీటు ఖచ్చితంగా జనసేనకు ఇవ్వాల్సిందే.

కాబట్టే సీతారామలక్ష్మిని ఇంచార్జ్‌గా పెట్టారు. ఎలాగో ఆమె…చంద్రబాబు మాట దాటి వెళ్లారు. కావాలంటే ఎన్నికల ముందు ఆమెని సైడ్ చేయొచ్చు.  అందుకే ఆమెని ఇంచార్జ్‌గా పెట్టినట్లున్నారు. అంటే పవన్ కల్యాణ్ కోసమే భీమవరంలో టి‌డి‌పిని డమ్మీగా చేసినట్లు తెలుస్తోంది. లేదంటే స్ట్రాంగ్‌గా ఉంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. భీమవరం నియోజకవర్గాన్ని పవన్‌కు అప్పగించడానికి బాబు ఈ త్యాగం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్ళలో ఆనందం చూడటానికి బాబు బాగానే కష్టపడుతున్నారు.