బాబు రాజకీయం: ఓటుకు నోటులో ప్రజలు… ఈఎస్ఐ స్కాంలో బీసీలు!

-

కాలం మారుతున్న బాబు పాత చింతకాయపచ్చడి రాజకీయాలు మాత్రం మారడం లేదు! ఇప్పటికీ ప్రతి వ్యవహారాన్ని కులాలు మతాలకు అంటగట్టే వ్యవహారం మార్చుకోవడం లేదు! ఇదే క్రమంలో తనకు ఏమైనా అయితే… ప్రజలు అందరికీ ఆపాదించి, అంతా తనకు చుట్టూ సెక్యూరిటీలా ఉండాలన్నట్లు మాట్లాడతారు. అదే ప్రజలను కుల మతాలుగా విభజించి పాలించాలనుకుంటారు. ఇదే క్రమంలో తాజాగా అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే బీసీలంతా లేచిరావాలంటున్నారు.

“అచ్చెన్నాయుడు కిడ్నాప్‌ కు జగన్‌ బాధ్యత వహించాలి. హోంమంత్రి రాజీనామా చేయాలి. అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలి. అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బహీనవర్గాలపై దాడి. రాష్ట్రవ్యాప్తంగా బడుగు బహీనవర్గాల ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి” అచ్చెన్నాయుడి అరెస్ట్ తర్వాత బాబు స్పందన ఇది. ఉదయం 7:30 అరెస్టు చేశామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు చెబుతుంటే… హోంమంత్రి రాజినామా చేయాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. నామినేషన్‌ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు. సంక్షేమ పథకాల్లో బీసీలకు కోతలు విధించారు.. ఇప్పుడూ బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారంటూ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఎవరు ఎలా అర్ధం చేసుకోవాలో బాబే చెప్పాలి.

గతంలో నోటుకు ఓటు కేసు వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన నేపథ్యంలో… హైదరాబాద్ ని విడిచి విజయవాడకు పయనమయిన చంద్రబాబు… ఏపీలో మీటింగులు పెట్టారు. నన్ను భయపెట్టాలని చూస్తున్నారు తమ్ముళ్లు… నాకు భయం లేదు… నాకు మీరంతా ఉన్నారు… నాకు ఏమైనా అయితే మీరంతా తోడుండాలి… ఏపీ వాసులకు హైదరాబాద్ లో ఉండే హక్కు లేదా… అంటూ… తాను చేసిన పనిని ప్రజలందరికీ పులిమే ప్రయత్నం చేశారు.. రెచ్చగొట్టే ఉపన్యాశాలు చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు… బీసీలంతా రోడ్లపైకి రావాలన్నట్లుగా బాబు పిలుపునిస్తున్నారు. ప్రజలు వింటున్నారు… ప్రజలు చూస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news