ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్ ని తన బృందం తో వెళ్లి కలిసిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నాని.. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
మాచర్లకు మా నేతలు మూడు కార్లలో వెళ్లారని… 10 కార్లు వెళ్లాయని అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మీ మాటలను ప్రజలు నమ్మరన్నారు. మీకు ఎవరూ భయపడేది లేదని, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేస్తారా? అని ప్రశ్నించారు. ఆంబోతుల మాదిరి రోడ్ల మీద పడి ఇష్టానుసారంచేస్తే మేం భయపడాలా? ఏం ఆటలాడుతున్నారా..? మీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు.
ప్రజలు పిచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతారని, ఆ రోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. పది కార్లలో వెళ్ళారని ఆబద్ధం చెప్తున్నారని, వెళ్ళింది లాయర్లు, గన్ మెన్లు అని, ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. వైసీపీ హింసకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచిఉందని, మీకు భయపడి మేము సరెండర్ కావాలా అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.