ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిన్న నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ జీవితంలో చిన్న నాటి జ్ఞాపకాలు అనేవి గుర్తుకు వస్తే చిన్న పిల్లలు అయిపోతు ఉంటారు. వాళ్ళు చదువుకున్న రోజులు, స్నేహం చేసిన రోజులు ఇలా ఏది చూసినా సరే వాళ్లకు జ్ఞాపకాలు అనేవి కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కాలేజి రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతూ ఉంటారు.
చదువుకున్న రోజులు, స్నేహితులను కలిసిన రోజులు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఎన్నో జ్ఞాపకాలను కళ్ళ ముందు ఉంచుతాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాగే భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా రెండు రోజుల నుంచి కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు… కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామానికి వెళ్లారు.
ఈ సందర్భంగా తన ఎస్వీ యూనివర్సిటీలోని తన సహాధ్యాయి రత్నం కుటుంబాన్ని కలిశారు. తన స్నేహితుడి తండ్రి 98 ఏళ్ల పి.ఆర్. శ్యామ్‌ను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఫోటో షేర్ చేసారు. ఈ సందర్భంగా రత్నం తన దగ్గర ఉన్న పాత ఫోటోలను చంద్రబాబుకు చూపించారు. ఆ సమయంలో చంద్రబాబు ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయారు. తన కాలేజీ రోజులు, ఆనాటి స్నేహాలు అన్నీ గుర్తుకు తెచ్చుకున్న చంద్రబాబు, మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందన్నారు.