వంశీ… చంద్రబాబుని లెక్క చేయడం లేదా…? కేసినేని కూడా ఇదే చెప్పారా…?

-

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వ్యవహారం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనపడుతున్న తరుణంలో బలమైన నేతగా ఉన్న వంశీ ఇప్పుడు పార్టీ మారేందుకు చూడటం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పార్టీ మారడానికి వెనకడుగు వేయకపోవడం చంద్రబాబుకి ఇబ్బందిగా మారింది. వంశీకి నచ్చజెప్పే బాధ్యతను చంద్రబాబు విజయవాడ ఎంపీ కేసినేని నాని, బందరు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు అప్పగించిన సంగతి తెలిసిందే.

నాలుగు రోజుల క్రితం వీరు ఇద్దరు వంశీతో సమావేశం నిర్వహించగా… వంశీ పార్టీ మారడానికే మొగ్గు చూపారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే తాను మాత్రం ఉండేది లేదని నానికి కూడా స్పష్టంగా చెప్పడంతో వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగారు. వంశీతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నాను మీ నాయకత్వంలో నేను పని చేయలేనని చెప్పినట్టు తెలుస్తుంది. అనామకులకు ప్రాధాన్యత ఇచ్చి… వాళ్ళ మాటలను లెక్క చేసి తనను కనీసం పట్టించుకోకపోవడంపై వంశీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది.

చంద్రబాబుకి కూడా ఇదే విషయాన్ని వంశీ స్పష్టంగా చెప్పారట. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కార్యాలయానికి వస్తే తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదని ఇప్పుడు తాను మీతో ఉండలేను అనే విషయాన్ని ఆయన వివరించారట. ఇక కేసినేని నానితో తర్వాత చంద్రబాబు మాట్లాడగా తాను కూడా ఏం చేయలేను అనే విషయాన్ని నానీ చెప్పారట. కొందరు కార్యకర్తల్లో కూడా వంశీ పార్టీ మారితేనే బాగుంటుంది అనే అభిప్రాయం ఎక్కువగా వినపడిందని నాని చంద్రబాబుకి వివరించారు. దీనితో ఇక లాభం లేదని బాబు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news