క్యాబినెట్ ‘బెర్త్’ల రిజర్వేషన్…వెయిటింగ్ లిస్ట్ బాగానే ఉంది…

-

ఏపీలో అప్పుడే మంత్రి పదవుల సందడి మొదలైంది. జగన్ అధికారంలోకి రాగానే 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని, అవకాశం దక్కనివారికి మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేసి అప్పుడు అవకాశం కల్పిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ పాలన మొదలుపెట్టి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది. మరో మూడు, నాలుగు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు మంత్రివర్గంలో మార్పులపై అనేక ఊహాగానాలు వచ్చాయి.

అయితే తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 100 శాతం మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని చెప్పేశారు. అంటే ఉన్న 25 మంది మంత్రులని తీసేసి మరో 25 మంది కొత్త వారికి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి ఆశించే ఆశావాహుల లిస్ట్ పెరిగింది. క్యాబినెట్ బెర్త్ రిజర్వ్ చేసుకోవాలని ఇప్పటినుచే ప్రయత్నాలు మొదలుపెట్టారు..లాబీయింగ్‌లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జిల్లాల వారీగా మంత్రి పదవుల ఆశించే వారి లిస్ట్ బయటపడింది. మొదట శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు పదవి ఆశించే వారిలో ఉన్నారు. స్పీకర్‌గా ఉన్న తమ్మినేని, క్యాబినెట్‌లోకి రావడానికి చూస్తున్నారు. అదే జరిగితే స్పీకర్ పదవి…ఇప్పుడు మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌కు దక్కే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇటు విజయనగరం జిల్లాకు వస్తే కొలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొరలు లైన్‌లో ఉన్నారు. విశాఖ జిల్లకొస్తే గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, ఉమా శంకర్ గణేశ్‌లు పదవి ఆశించే వారిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news