చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ వైరస్ దెబ్బకి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావటంతో చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. ఈ పరిణామంతో చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం ప్రజలు తెగ అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ సమస్య కూడా ఉన్న కొద్ది పెరుగుతుంది. ఇటువంటి తీవ్రమైన ప్రమాదకరమైన వైరస్ గురించి ముందుగానే ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా చైనా తప్పు చేసిందని ప్రస్తుతం చాలా దేశాల అధినేతలు సీరియస్ అవుతున్నారు.అసలు చైనాలో కొన్ని లక్షల సంఖ్యలో చనిపోయారని…కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా చైనా ప్రభుత్వం కరోనా వైరస్ ని ప్రపంచంలోకి వదిలింది అని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవటానికి చైనా ఈ విధంగా వ్యవహరించిందని ప్రపంచ ఆర్ధిక నిపుణులు కొంతమంది ఆరోపిస్తున్నారు. చైనా చేసిన ఈ తప్పు ప్రపంచంలో కొన్ని వేల మంది అమాయకులు చనిపోతున్నారు కాబట్టి చైనా దేశాన్ని అంతర్జాతీయ కోర్టులో అనగా UNO బోనులో చైనా అధ్యక్షుడు ని నిలబెట్టాలని ప్రపంచంలో అగ్రదేశాలు ఆలోచిస్తున్నాయి. మరికొన్ని దేశాలు కరోనా వైరస్ వల్ల చనిపోయిన ప్రతి మనిషికి చైనా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే టైమ్ లో అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వల్ల ఎక్కువ నష్టపోవడంతో చైనా దేశంలో అసలు ఈ వైరస్ ఎలా పుట్టుకొచ్చిందో అన్ని వివరాలు రాబట్టడానికి సిఐఏ తో దర్యాప్తు చేయడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో కావాలని చైనా ఈ వైరస్ ని ప్రపంచంలోకి పంపిస్తే కనుక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కి అంతర్జాతీయ కోర్టులో ఘోరమైన శిక్ష అమలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ న్యాయ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలు మొత్తం చైనా ని ఏకాకి చేసి ప్రపంచ పటంలో లేకుండా చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని చాలామంది పేర్కొంటున్నారు.