ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను వాడుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాలంటీర్ల విషయంలో ఇప్పటికే వైసీపీ నేతలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక వాలంటీర్లు అంశానికి సంబంధించి బీజేపీ నేతలు కూడా ఇప్పుడు గట్టిగానే దృష్టి పెడుతున్నారు అని తెలుస్తోంది.
వాలంటీర్లు అతి ప్రదర్శించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని కొన్ని ఆరోపణలు టిడిపి నేతలు ఆధారాలతో సహా చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా దీన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకొనే విషయంలో వైసీపీ నేతలు జాగ్రత్తగా లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు.
వాలంటీర్లు బెదిరిస్తే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఇది తీరని నష్టం చేకూర్చే అవకాశం ఉండవచ్చు అని చాలామంది గమనించటం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే విధంగా ప్రజలను బెదిరిస్తే మాత్రం చాలా మంది వైసీపీ నేతల మీద వ్యతిరేకత పెంచుకునే అవకాశాలు ఉంటాయని సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందించాల్సిన అంశం మీద దృష్టి పెట్టడం మానేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైసిపి కార్యకర్తలు లాగా వ్యవహరిస్తే మాత్రం ముఖ్యమంత్రి జగన్ పరువు పోయే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.