యువతకు సీట్లు ఇస్తున్న సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు..

-

రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ.. యువతను పార్టీ వైపు తిప్పుకునేందుకు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని కొన్నిచోట్ల జూనియర్లకు ఇన్చార్జిలకు అవకాశం కలిపిస్తే.. మరి కొన్నిచోట్ల తమ వారసులుకు టికెట్లు ఇవ్వాలని కోరిన చోట యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ ఇన్చార్జి బాధ్యతలు కట్టపడుతున్నారు..

CM Jagan’s visit to Tirupati district today

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఇన్చార్జిలు మార్పులో భాగంగా రెండవ జాబితాను ప్రకటించింది.. అందులో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చీపురెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. కొన్నిచోట్ల తమ వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ కొందరు నేతలు సీఎం జగన్ ని కోరుతూ వచ్చారు.. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గ కార్యక్రమాలు చక్కదిద్దేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు, అభినయ రెడ్డి మోహిత్ రెడ్డిలు నియోజవర్గ రాజకీయాలకు అలవాటు పడ్డారు..

తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన భూమన అభినయ్ అభివృద్ధిలో కీలకంగా మారారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిలో రోడ్ల నిర్మాణాలు శరవేగంగా చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభినయ రెడ్డి కృషి చేశారు.. ఈ క్రమంలో తిరుపతి పట్టణ ప్రజల అభిమానన్ని ఆయన సంపాదించారు.. దీంతో ఆయన్ని తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.. మరోపక్క తుడా చైర్మన్ గా టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సైతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. నియోజకవర్గంలో ప్రతి గడపను తొక్కుతూ.. అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయకపోవడంతో.. తన కుమారుడికి అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డిని ఆయన కోరారు అంట.. దీంతో సీఎం జగన్ మోహిత్ రెడ్డికి చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టారు.. యువతకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే భవిష్యత్తు తరాలకు డోకా వుండదని భావించిన జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తూ యువతకు ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news