నెల్లూరు జిల్లాలో ఆ నాలుగు నియోజకవర్గాలపై పట్టు బిగిస్తున్న సీఎం జగన్..

-

నెల్లూరు జిల్లా రాజకీయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు.. ఓ ఎంపీ తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో వారికి సరైన బుద్ధి చెప్పేందుకు స్కెచ్ రెడీ చేశారట. పార్టీ వీడిన వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజా కోర్టులో వారిని దోషులుగా నిలబెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. పార్టీలో గెలిచి, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లే టికెట్ తెచ్చుకున్న ఆ నేతలపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారట..

రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు.. ఈ సమయంలో పార్టీలోని ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసారట.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాలలో నెల్లూరు ఉండడంతో.. ఈ జిల్లా రాజకీయాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారని పార్టీలో టాక్ వినిపిస్తోంది.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి లతో పాటు రాజ్యసభ సభ్యులుగా ఉంటూ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీ మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు రాజకీయంగా చెక్ పెట్టాలని, అందుకు అవసరమైన వ్యూహాలను జిల్లా ముఖ్య నేతలతో చర్చించారట..

నెల్లూరు జిల్లా అను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఎలాగైనా పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలవాలని cm జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ప్రచారం నడుస్తుంది.. ఈ మూడు నియోజకవర్గాలతో పాటు ఎంపీ నియోజకవర్గంపై చర్చించేందుకు విశ్రాంతి పేరుతో జగన్ నెల్లూరులో బస చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొదలుపెడితే ఉద్దండలు సైతం వణికిపోవాల్సిందే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news