ఆ వ్యాపారాలు ఆపేయండి… జగన్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి వ్యక్తిగత వ్యాపార విషయంలో కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిన సరే వాళ్ళు పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసే వారికి ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సూచనలు చేశారు. అయినా సరే కొంతమంది ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు కొనసాగించడం కారణంగా పార్టీ ఎక్కువగా నష్టపోతుంది.

jagan

ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు కర్ణాటకలో వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్నారు. అలాగే తెలంగాణలో ఉన్న మంత్రులతో కూడా ఎక్కువగా సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీనివలన భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలను టిఆర్ఎస్ పార్టీ సహకారంతో హైదరాబాదులో వైసిపి బాగా ఇబ్బంది పెట్టింది. సీఎం కేసీఆర్ సహకారం తో తెలుగుదేశం నేతలను బాగా ఇబ్బంది పెట్టారు.

ప్రధానంగా మాజి ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి. గోదావరి జిల్లాలకు చెందిన కొంత మంది కూడా హైదరాబాదులో వ్యాపారాలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాలలో వ్యాపారాలు చేయడంతో భవిష్యత్తులో ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు అక్కడున్న సన్నిహితుల ద్వారా వైసీపీ నేతలను ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు వెనక్కు తగ్గాలని ముఖ్యమంత్రి జగన్ సూచిస్తున్నారు.