తెలంగాణ నేతలపై జగన్ ఫైర్.. మా వాటా మేం తీసుకుంటున్నాం… తప్పేంటి !

-

అనంతపురం జిల్లాలో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ జల వివాదం పై స్పందించారు. తెలంగాణ నేతలు ఏపీ ప్రభుత్వంపై… ఇంటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ ప్రాంతానికి ఎన్ని టీఎంసీలు అనేది గతంలోనే నిర్ణయించారని… కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి తెలంగాణ నీటిని తీసుకుంటోందని పేర్కొన్న సీఎం జగన్.. రాయలసీమ  పరిస్థితి మీకు తెలియదా ? అని మండిపడ్డారు.

మాకు కేటాయించిన నీటిని మేము తీసుకుంటే తప్పేంటి ? అని ప్రశ్నించారు సీఎం జగన్. రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు అలాగే తెలంగాణకు 298 టిఎంసిలు కేటాయించారు అని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని వెల్లడించారు సీఎం జగన్. అటు నీటి వివాదంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గాడిదలు కాసే రా అని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news