త్వరలోనే ఢిల్లీ పర్యటనకు జగన్…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లడానికి గాను సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీలతో కలిసి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Jagan
Jagan

అంతేకాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో కూడా భేటీ అయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీ లో నెలకొన్న తాజా పరిస్థితులను ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లి రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా కోరే అవకాశాలు ఉన్నాయి. నిధులు ఇవ్వకపోయినా అప్పు కోసం అయినా కేంద్రం సహకరించాలని జగన్ కోరే అవకాశముందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.