10 మంది మంత్రుల‌కు శాఖ‌ల‌ను కేటాయించిన‌ సీఎం కేసీఆర్‌..!

-

సీఎం కేసీఆర్ సార‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర నూత‌న మంత్రులు ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం విదిత‌మే. రాజ్‌భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ నూత‌న మంత్రుల‌చే ప్ర‌మాణం చేయించారు. 10 మంది ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ మంత్రులుగా అవ‌కాశం ఇచ్చారు. కాగా ఆ 10 మంది మంత్రుల‌కు కేసీఆర్ తాజాగా శాఖ‌ల‌ను కేటాయించారు. ఆ వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

1. ఈటల రాజేందర్ – వైద్య‌, ఆరోగ్యం
2. వేముల ప్రశాంత్ రెడ్డి – రవాణా, రోడ్లు భవనాలు
3. గుంటకండ్ల జగదీష్‌రెడ్డి – విద్యాశాఖ
4. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి – వ్యవసాయశాఖ
5. తలసాని శ్రీనివాస్‌యాదవ్ – పశుసంవర్థకశాఖ
6. కొప్పుల ఈశ్వర్ – సంక్షేమశాఖ
7. ఎర్రబెల్లి దయాకర్‌రావు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
8. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి – న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం శాఖ‌లు
9. వి. శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్ – పర్యాటకం, క్రీడలు
10. చామకూర మల్లారెడ్డి – కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి శాఖ‌లు

ఇవాళ ఉద‌యం 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా, వారికి సాయంత్రం సీఎం కేసీఆర్ ఆయా శాఖ‌ల‌ను ఇచ్చారు. ఈ క్ర‌మంలో నూత‌న మంత్రులు త్వ‌ర‌లో త‌మ‌కు ఇచ్చిన శాఖ‌ల‌కు గాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news