కేసీఆర్ ‘ మెగా ‘ బాణం ? గుచ్చుకున్నోళ్లకి గుచ్చుకున్నంత ?

-

ఆషామాషీగా రాజకీయాలు చేస్తే తాను కెసిఆర్ ఎందుకు అవుతాను అన్నట్లుగా రాజకీయ వ్యూహాలు పన్నుతూ ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు తన తెలివితేటలతో వాటి నుంచి బయట పడుతూ ఉంటారు. 2014 ఎన్నికల దగ్గర నుంచి కేసీఆర్ ఈ రకమైన ఫార్ములాను ఉపయోగిస్తూనే సక్సెస్ అవుతు వస్తున్నారు. అయితే ఆ ఫార్ములా ఉప ఎన్నికలలో దెబ్బ వేసినప్పటికీ, గ్రేటర్ ఎన్నికల్లో ఆ దెబ్బ నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ రాజకీయ శత్రువులకు చిక్క కుండా పై సాధించే వ్యూహానికి తెర తీశారు.

ప్రస్తుతం ఎంఐఎం పార్టీ తో సహా అన్ని పార్టీలు టిఆర్ఎస్ పై గ్రేటర్ లో యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధంలో గెలిస్తేనే రానున్న రోజుల్లో టిఆర్ఎస్ భవిష్యత్తు కు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే అన్ని విషయాల పైన వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ, పార్టీ నాయకులను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే… గ్రేటర్ పరిధిలో దూకుడుగా ఉన్న బిజెపి తమ కొత్త మిత్రుడు పవన్ ను సైతం గ్రేటర్ ఎన్నికల బరిలో తమకు మద్దతుగా రంగంలోకి దింపింది. మొదటగా జనసేన ఇక్కడ సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమైనా, ఆ తర్వాత బిజెపికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ పరిధిలో మెగా అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో టిఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.

అయితే దీనికి వ్యూహాత్మకంగా కేసీఆర్ చెక్ పెట్టినట్టు కనిపిస్తున్నారు. దీనికి సినీ పరిశ్రమను వాడేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి వారు కేసీఆర్ ను కలిసి సినిమాకి సంబంధించి అనేక సమస్యలను ప్రస్తావించారు. ఈ సమస్య పై స్పందించిన కేసీఆర్ తాజాగా వాటిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. సినిమా హాళ్లను, మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చేశారు. దీంతో కేసిఆర్ ను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం, అటు జనసేన ఇటు మెగా అభిమానులను ఆశ్చర్య పరిచింది. అయితే వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఏ విధంగా చక్రం తిప్పినట్లు గా అర్థమైంది.

ఇప్పుడు మెగా స్టార్ తదితరులు కెసిఆర్ ను అకస్మాత్తుగా కలవడం తో సినిమా ఇండస్ట్రీతో పాటు, మెగా అభిమానులంతా టి ఆర్ ఎస్ వైపే ఉన్నారనే సంకేతాలను వచ్చారు. అదీ కాకుండా చిరంజీవి తన ట్వీట్ లో కేసీఆర్ ను, కెసిఆర్ పరిపాలన, ప్రజల కోసం పడుతున్న తపనను, ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం వెనుక అనేక అర్థాలు, పరమార్థాలను టిఆర్ఎస్ నాయకులు హైలెట్ చేస్తున్నారు.ఈ వ్యవహారంలో అటు పవన్ తో పాటు బీజేపీని ఇరుకున పెట్టే విధంగా కెసిఆర్ రాజకీయ చక్రం తిప్పినట్లు గా కనిపిస్తున్నారు. అందుకే ఇంత హడావుడిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుని, సినీ గ్లామర్ టిఆర్ఎస్ కు ఉండేవిధంగా కెసిఆర్ చక్రం తిప్పినట్లు గా కనిపిస్తున్నారు. పరిణామాలు అటు జనసేన ఇటు బిజెపి లకు ఇబ్బందికరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news