తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు.. కొంగొత్త నినాదాలు..

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ వైఖరిలోనూ కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఫామ్ హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్‌తో నియోజకవర్గాల బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక తాజాగా ‘దళిత బంధు’  స్కీమ్ లాంచింగ్‌లో ‘జై భీమ్’ అని నినదించారు. ఈ నేపథ్యంలోనే సీఎం వైఖరిలో మార్పు వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఇకపోతే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఇదొక్కటే కాకుండా తెలంగాణలో సీఎంకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు బలపడుతున్నాయి.

Cm kcr today visits huzurabad
Cm kcr today visits huzurabad

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత ఆయన తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘దళిత, గిరిజన దండోరా’ సభలు నిర్వహిస్తున్నారు. ఇక ‘బహుజనవాదం’ను తెరమీదకు తీసుకొచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఉన్న ప్రవీణ్ ‘అక్షరం-ఆర్థికం-ఆరోగ్యం’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా టీఆర్ఎస్ అధినేత, సర్కారుపైన సూటిగానే విమర్శలు చేస్తున్నారు. ఇక జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పాదయాత్ర, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర, వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల పాదయాత్రలతో తెలంగాణలో ‘యాత్ర’ల పర్వం షురూ అవుతున్నది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఉండేందుకుగాను అధినేత కేసీఆర్ ‘దళిత సంక్షేమ రాగం’ ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ వల్లే కేసీఆర్ బహుజన వాదం వైపు వెళ్లినట్లు కొందరు పేర్కొంటుండగా, కేసీఆర్ మాత్రం ఏడాది కిందటే ‘దళిత బంధు’ ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయం వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news