మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రేపు ముంబై వెళ్లనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా ఆహ్వానించారు. లంచ్ మీటింగ్ లో ఇరు నేతలు కలుసుకోనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, బీజేపీకీ వ్యతిరేఖంగా కేసీఆర్ గళమెత్తారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. కేసీఆర్ పోరాటానికి మద్దతు ప్రకటించారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు పోరాడుతున్న కేసీఆర్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 1 గంటకు ఉద్దవ్ ఠాక్రేతో లంచ్ మీటింగ్ లో ఇరు నేతలు చర్చించనున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల గురించి…. థర్డ ఫ్రంట్ గురించి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీలతో కూడా ఇటీవల సీఎం కేసీఆర్ మాట్లాడారు.