Breaking : ఎరువు ధ‌రల‌పై పీఎం మోడీకి సీఎం కేసీఆర్ లేఖ‌

-

ఎరువుల ధ‌రల పెంపు విష‌యంలో పీఎం మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వం పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంద‌ని ఆరోపించారు. ఎరువుల ధరలను పెంచి కేంద్రం అన్నదాతల నడ్డి విరిచిందని విమ‌ర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం.. నేడు రైతు వ్యతిరేఖ నిర్ణ‌యాలు తీసుకుటుంద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కేంద్రం నిర్ణ‌యంతో వ్యవసాయ ఖర్చులు రెట్టింపు అవుతాయ‌ని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో రైతుల‌ను బతకనిచ్చే పరిస్థితి లేదని విమ‌ర్శించారు. వ్యవ‌సాయ క్షేత్రాల వ‌ద్ద మోట‌ర్లు బిగించ‌డం, బిల్లులు వ‌సూల్ చేస్తున్నార‌ని ఆగ్రహించారు. అలాగే ప్ర‌జలు, రైతుల డిమాండ్ చేస్తున్నా.. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం లేద‌ని అన్నారు. ఇప్ప‌టికే రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయ‌కుండా రైతుల‌ను కేంద్రం ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని ఆగ్ర‌హించారు. ఇప్పుడు రైతుల పొలాల్లోనే రైతుల‌ను కూలీలు చేసేవిధంగా కేంద్రం కుట్ర‌లు ప‌న్నుతుంద‌ని ఆరోపించారు.

 

దేశ వ్యాప్తంగా వ్య‌వ‌సాయ రంగాన్ని నిర్వీర్యం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆరోపించారు. వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ పెద్ద‌ల‌కు కట్టబెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కుట్రలు చేస్తుంద‌ని ఆరోపించారు. 50 ఏళ్ల నుంచి ఎరువుల పై ఉంటున్న స‌బ్స‌డీని మోడీ ప్ర‌భుత్వం ఎత్తేసింద‌ని అన్నారు. ఎరువుల ధ‌న‌లను కేంద్ర ప్ర‌భుత్వం త‌గ్గించ‌క పోతే రాష్ట్ర ప్ర‌జ‌లు బీజేపీని నిల‌దీయాల‌ని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news