మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరెత్తితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంతెత్తున లేచి పడతాడు. బాబు వెన్నుపోటు రాజకీయాల గురించి ఏ డిబేట్ కైనా రెడీ అంటాడు. చంద్రబాబు సొంత మీడియాకి సైతం వచ్చి తన గళాన్ని వినిపిస్తానని చాలా సందర్భాల్లో వెల్లడించాడు. చంద్రబాబు వర్సెస్ మోహన్ బాబు అని రాసినా ఫీలవ్వనని…నిజంగానే అతనితో శత్రుత్వం ఉన్నప్పుడు నటించాల్సిన అవసరం ఏముంటుందని పబ్లిక్ గా చాలాసార్లు చెప్పాడు మోహన్ బాబు. ఇటీవల ఎన్నికల సమయంలో చంద్రబాబును బ్యాకెండ్ ఓ రేంజ్ లో డీగ్రేడ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇదంతా ఇప్పుడు. మరి గతంలో చంద్రబాబు- మోహన్ బాబు ఎలా ఉండే వారో తెలుసా? దోస్తే మేరా దోస్త్ ..తుహీ మేరా సాత్ అన్నట్లు ఇద్దరు మంచి స్నేహితులు. ఇదంతా ఇప్పుడెందుకునుకుంటున్నారా? అయితే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.
మోహన్ బాబు గారాల పట్టి, నిలదీస్పై లక్ష్మీ ప్రసన్న కొన్నేళ్ల క్రితం చంద్రబాబు-మోహన్ బాబు కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరిద్దరి భాగస్వామ్యంలో హెరిటేజ్ సంస్థ కు చెందిన ఓ ఔట్ లెట్ కు భూమి పూజ చేస్తోన్న పిక్ అని పేర్కొంది. ఇవి నిజంగా అద్భుతమైన రోజులు. కాలం మారిపోయవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కూల్ గా కనిపించే టోపీ, కళ్లద్దాలతో నాన్న అని ట్యాగ్ చేసింది. ఈ సందర్భంగా హెరిటేజ్ గతంలోకి వెళ్తే…ఇటీవల ఎన్నికల సమయంలో హెరిటేజ్ ఫుడ్ కంపెనీ తనది మోహన్ బాబు అన్నారు. చంద్రబాబు తో కలిసి ఈ కంపెనీ స్టార్ట్ చేసాను.
తానే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లు..చంద్రబాబు తక్కువ పర్సెంటేజ్ అని, దాగా అనే నే వ్యక్తిది కొంత మొత్తం హెరిటేజ్ లో పెట్టుబడులు పెట్టారుట. అయితే కంపెనీ లాభాల బాట పట్టడంతో కొన్ని నెలలకే చంద్రబాబు కొన్ని ఖాళీ పేపర్లు చూపించి మోసం చేసి సంతకాలు పెట్టించాడని మోహన్ బాబు పేర్కొన్నాడు ఎందుకని ప్రశ్నించగా? కుంటి సాకులు చెప్పినట్లు తెలిపారు. అయితే ఇదంతా కేవలం చంద్రబాబు మీద నమ్మకంతోనే చేసానని, స్నేహితుడని, తెలిసిన వ్యక్తి అని నమ్మి సంతకాలు పెట్టినట్లు తెలిపారు. తర్వాతి కాలంలో చంద్రబాబు బలం గుర్తించి తాను ఎదురెళ్ల లేక మౌనంగా ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్లే హెరిటేజ్ విషయంలో తనకు వెన్నుపోటు పొడిచాడని మోమన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.