పొద్దు పొద్దున్నే అమ్మ ఎక్కడికి వెళ్లిందో..! నాకు చెప్పకుండానే బయటకు ఎగిరిపోయింది.. ఇక్కడేమో నేనొక్కదాన్నే ఉన్నా.. చాలా భయంగా ఉంది.. మరోవైపు ఆకలిగా ఉంది.. ఏం చేయాలి..? బయటకు వెళ్లాలా..? అమ్మ వస్తుందా..? నాకు ఆహారం తెస్తుందా..? నేనిక్కడే ఇలాగే ఉండాలా..? బయటకు వెళ్దామంటే నాకింకా ఎగరడం తెలియదే.. ఇప్పుడెలా..?
ఎగరడం తెలిసినా బాగుండును.. బయటకు వెళ్లి ఏదో ఒక ఆహారం తినేదాన్ని.. అయినా.. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం.. ఎగురుతామా.. లేదా.. అని.. అరే.. నా రెక్కలు నాకు సహకరించడం లేదేంటి.. అమ్మలాగే నాకూ రెక్కలున్నా.. నేనెందుకు ఎగరడం లేదు.. అమ్మ నాకు ఎగరడం నేర్పి బయటకు వెళ్లినా బాగుండును.. ఇప్పుడేమీ చేయలేని స్థితిలో ఉన్నా..!
అరె.. వచ్చిందెవరు.. అమ్మేగా.. అవును.. నిజంగా అమ్మే.. ఏదో తీసుకొచ్చిందే.. నాకేనా.. అవును.. అమ్మా.. అమ్మా.. ఆహా.. తిండి ఎంత కమ్మగా ఉందో.. ఛ.. అనవసరంగా అమ్మను తిట్టుకున్నా.. చెప్పకుండా బయటకు వెళ్లిందని.. నాకు ఆహారం తేవడం కోసం అమ్మ ఎంత దూరం వెళ్లిందో.. ఇంతకీ అమ్మ ఆహారం తిందో, లేదో.. నా కడుపు మాత్రం నింపింది.. అవును.. ఎంతైనా అమ్మ అమ్మే కదా..!