కె.ఏ పాల్ ని కెలుకుతున్నారు ! బీకేర్ ఫుల్?

-

ప్ర‌జాశాంతి పార్టీ అధినేత‌, ప్ర‌పంచ శాంతి దూత కె.ఏ పాల్ గురించి అంద‌రికీ తెలిసిందే. క్రైస్త‌వ మ‌త ప్ర‌బోధ‌కుడిగా ప్ర‌పంచ‌దేశాల్లోనూ బాగా ఫేమ‌స్. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అధికారంలోకి రానంత కాలం పాల్ ప్రొఫెష‌న‌ల్ కెరీర్ తిరుగులేదు. ఆరు పువ్వులు..12 కాయ‌లుగా జీవితం సాగిపోయింది. వైఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీన్ సితారైంది. పాల్ ప్లేస్ లో వైఎస్సార్ అల్లుడు, బ్ర‌ద‌ర్ అనీల్ ని తీసుకురావ‌డంతో పాల్ మ‌నుగ‌డ త‌గ్గింది. ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఆంద్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌జాశాంతి పార్టీ కొన్ని స్థానాల్లో పోటి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పోటీలో పార్టీ అధినేత పాల్ కు 83 ఓట్లు ప‌డ్డాయి. ఆ విష‌యం ప‌క్క‌న‌బెడితే ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో పాల్ కామెడీ ఏ రేంజ్ లో వైర‌ల్ అయిందే విధిత‌మే.

వింత వింత చేష్ట‌ల‌తో నేటి జ‌నుల‌ను బాగా ఎంట‌ర్ టైన్ చేసాడు. తాజాగా పాల్ క్రేజ్ని ఇప్పుడు టాలీవుడ్ క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డింద‌ని ఓ రూమ‌ర్ వినిపిస్తోంది. పాల్ వ్య‌క్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని సునీల్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ద‌మవుతోందిట‌. ఈ చిత్రానికి ఓ కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడుట‌. సునీల్ తో గ‌తంలో సినిమాలు నిర్మించిన ఓ పెద్ద సంస్థ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వస్తోందిట‌. ఆద్యంతం కామెడీ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకుంటున్నారుట‌. అలాగ‌ని పాల్ ని కించ ప‌రిచేలా కాదు…కేవ‌లం త‌న వ్వ‌హారిక శైలిని మాత్ర‌మే హైలైట్ చేయ‌బోతున్నారుట‌. ఈ వార్త చూసిన నేటి జ‌నుల్లో కొంద‌రు పాల్ తో పెట్టుకుంటే కొబ్బ‌రి మ‌ట్ట‌తో పెట్టుకున్న‌ట్లే!

అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంత మంది పాల్ తో బీకేర్ ఫుల్.. అత‌ను చాలా తెలివైన వాడు. త్రాచు పాము తొక తొక్కితే పాము ఊరుకుంటుందా? కాటు వేయ‌దా? అత‌ను వ్య‌క్తిత్వన్ని..వ్వ‌వ‌హారిక శైలిని కామిక్ గా చూపిస్తే ఊరుకుంటుడా? బుస‌లు కొట్ట‌డా? అంటూ అంటూ స‌ర‌దా కామెంట్లు చేసారు. మ‌రి ఈ సినిమా విష‌యం పాల్ కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడా? చూద్దాం. ఇత‌కీ పాల్ ఇప్పుడు హైద‌రాబాద్ లో ఉన్నాడా? విదేశాల్లో ఉన్నాడా? అన్న‌ది ముందు తెలియాల్సిన విష‌యం.

Read more RELATED
Recommended to you

Latest news