రోజాపై జ‌గ‌న్‌కు ఫిర్యాదుల వెల్లువ‌… ఫైర్ బ్రాండ్ తేడా కొడుతోందే..!

-

జ‌బ‌ర్ద‌స్త్ రోజా రాజ‌కీయాల్లోనూ జ‌బ‌ర్ద‌స్త్ చేస్తున్నారా? అంద‌రినీ కలుపుకొని వెళ్ల‌డంలేదా? త‌నకు తోచిన వి ధంగా రాజ‌కీయాలు చేస్తున్నారా? సీనియ‌ర్ల‌ను సైతం ఆమె ఖాత‌రు చేయ‌డం లేదా? అంటే.. తాజాగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకా దు, రోజా దూకుడు క‌ళ్లెం వేయాలంటూ.. సాక్షాత్తూ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు సీనియ‌ర్ల నుంచే ఫిర్యాదు లు వెల్లువెత్తుతున్నాయ‌ని తెలుస్తోంది. విష‌యంలోకివెళ్తే.. రెండు సార్లు వ‌ర‌సుగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుం చి విజ‌యం సాధించిన రోజా తొలిసారి అంద‌రినీ క‌లుపుకొని పోయినా.. త‌ర్వాత మాత్రం త‌నే మోనార్క్ అ నుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఆమె త‌న‌కు భ‌జ‌న చేసిన వారినే ప్రోత్స‌హిస్తున్నార‌ని, అంద‌రూ త‌న‌ను “అమ్మ“ అని పిల‌వాల ని కోరుకుంటున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్న టాక్‌. అదేస‌మ‌యంలో త‌న‌ను ప్ర‌శ్నించిన వారిని ఆమె పార్టీ వ్య‌తిరేకులుగా ముద్ర వేస్తున్నార‌ని అంటున్నారు. రెండో సారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన త‌ర్వాత అంతా త‌న స్వ‌యంకృతంతోనేగెలిచాన‌నే బింకం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని కూడా ఇక్క‌డి నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుడు కేజే కుమార్ దంప‌తులు వైసీపీ కోసం క‌ష్టాలు ప‌డ్డారు. అయితే, వీరికి రోజాకు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. దీనికి కార‌ణం.. నియోజ‌క‌వ‌ర్గంలో కాంట్రాక్టులు, ప‌నులను ఇవ్వ‌డంలోను, పార్టీ నేత‌ల‌ను చూడ‌డంలోనూ వివ‌క్ష చూపిస్తున్నార‌ని ఈ దంప‌తులు ఆరోపించ‌డ‌మే.

ఈ ప‌రిణామం.. కొన్ని నెల‌లుగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర విభేదాల‌ను సృష్టిస్తోంది. వాస్త‌వానికి రోజాకు అంద‌రి మ‌ద్ద‌తూ ఉండేది. కానీ, కేజే కుమార్ వివాదం నేప‌థ్యంలో ఇప్పుడు న‌గ‌రిలో రెండు వ‌ర్గాలు ఏర్పాడ్డాయి. కేజే కుమార్ వ‌ర్గానికి మంత్రి పెద్ద‌రెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నాయ‌నేది నిర్వివాదాంశం. రోజాపై మొద‌ట్లో పెద్దిరెడ్డికి వ్య‌తిరేక‌త లేక‌పోయినా.. రానురాను ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్యానికి తెర‌దీస్తుండ‌డంతో ఆయ‌న కేజే వ‌ర్గాన్ని స‌పోర్టు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు కూడా ఇప్పుడు కేజే వ‌ర్గానికి అండ‌గా నిలిచారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రోజా ఒంట‌రి అవుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల కేజే కుమార్ దంప‌తులు ష‌ష్టి పూర్తి చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రోజా త‌ప్ప అంద‌రినీ ఆహ్వా నించారు. దీనిని సాకుగా తీసుకున్న రోజా.. నేత‌ల‌కు వార్నింగ్ ఇస్తూ.. వాయిస్ రికార్డ్ పోస్టు చేయ‌డం మ‌రింత క‌ల‌క‌లం సృష్టించింది. నిజానికి నెల‌కు ప‌ది రోజులు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌ని రోజాకు స్థానికంగా బ‌లం అవ‌స‌రం. కానీ, ఆమె బ‌ల‌మైన కేజే కుమార్‌తో విభేదాలు పెట్టుకోవ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకిస్తున్నారు. అంద‌రినీ క‌లుపుకొని పోవాలంటూ .. పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించినా ఆమె ప‌ట్టించుకోకుండా త‌న‌కు భ‌ట్రాజులుగా ఉండేవారికి మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తుండ‌డం ఇప్పుడు తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news