తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయన్న విషయం 2019 ఎన్నికల తర్వాత స్పష్టంగా అర్థమైంది. చాలామంది అగ్రనేతలు కొన్ని కొన్ని పదవుల విషయంలో కక్కుర్తి పడడం కూడా జరిగింది. జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ లో చాలామంది నాయకులు పదవుల కోసం కక్కుర్తి పడ్డారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు వద్ద ప్రాధాన్యత ఉన్న చాలామంది తమకు నచ్చిన వారికి పదవులు ఇప్పించడానికి తీవ్రస్థాయిలో కష్టపడటం కూడా జరిగింది.
సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలు కూడా చివరకు పార్టీలో పదవుల కోసం కూడా కక్కుర్తి పడిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పదవి విషయంలో విభేదాలు బయట పడుతున్నాయని సమాచారం. తెలుగు యువత అధ్యక్షుడు విషయంలో ఇప్పుడు ఆరోపణలు తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఎక్కువగా వినబడుతున్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ కి తెలుగుయువత అనేది చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఈ విభాగం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఆ పార్టీలో చాలావరకు వివాదాలకు దారితీస్తోంది. వాస్తవానికి ప్రజల్లోకి వెళ్ళే నాయకుడు ఉండాల్సి ఉంటుంది. కానీ తెలుగు యువత స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో దారుణంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కార్యకర్తలకు కూడా తెలుగు యువత అధ్యక్షుడు ఎవరో తెలియని పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన నాయకుడు సరే ఆయన బయటకు రాకపోవడం సమస్యలకు దారితీస్తోంది.