సీతక్కతో రేవంత్‌కు ఇబ్బందేనా?

-

తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సొంత అన్నాచెల్లెళ్ళు మాదిరిగా ఉంటారు. అలాంటిది సీతక్కతో ఫ్యూచర్‌లో రేవంత్‌కు ఏమైనా ఇబ్బంది వస్తుందా? అంటే అసలు కలలో కూడా అలాంటి పని జరగదని చెప్పొచ్చు. కానీ వీరి విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. సీతక్కని హైలైట్ చేస్తూ, రేవంత్‌ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా సీతక్క చేసే ప్రజా సేవకు పార్టీలకు అతీతంగా ఆమెని అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. కరోనా సమయంలోఆమె, ప్రజలకు ఎలా అండగా నిలబడ్డారో అందరికీ తెలిసిందే.

ఇలా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న సీతక్కకు రేవంత్ న్యాయం చేయలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు ఉన్న ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ ఛైర్మన్‌తో పోల్చుకుంటే సీతక్క వెయ్యిరెట్లు బెటర్ అని, మరి రేవంత్ సీతక్కకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అంటే ఫ్యూచర్‌లో సీతక్క తనకు ఎక్కడ పోటీ వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ పట్టించుకోవడం లేదని అంటున్నారు.

అయితే బీజేపీ ఎంపీ మాటలు వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, సీతక్క, రేవంత్‌ల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. రేవంత్‌కు ఏ హోదా వచ్చినా, అదే హోదా తనకు వచ్చినట్లు సంతోషపడే సీతక్క ఎప్పుడు రేవంత్ మంచి హోదాలోనే ఉండాలని చూస్తున్నారని, అటు సీతక్కకు రేవంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పాల్సిన పని లేదని చెబుతున్నారు. బీజేపీ ఎంపీ మాత్రం కాంగ్రెస్‌లో చీలిక తీసుకొచ్చి, బీజేపీకి లబ్ది చేకూరేలా చేస్తున్నారని, కానీ బీజేపీ ప్లాన్ ఏ మాత్రం వర్కౌట్ కాదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news