సాగర్ ఉపఎన్నిక: ఆ మండలాల్లో మెజార్టీ రాకపోతే కోమటిరెడ్డి,రేవంత్ పని ఇక అంతేనా

-

తెలంగాణ కాంగ్రెస్ కి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక చావో రేవో లాంటి సమస్య. దీనికి తోడు…ఇక్కడ ప్రచారం కి వెళ్ళిన నాయకుల మధ్య కూడా ఎవరి బలం ఎంత అనేది కూడా బయట పడుతుంది అంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.జానారెడ్డి గెలవడం ఎంత అవసరమో.. ఇక్కడ తమ పని తీరు చుపించుకోవడం కూడా వాళ్లకు అంతే అవసరం. దీంతో కోమటిరెడ్డి,రేవంత్ ఇద్దరూ పోటీపడి నడిపారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరి బలం ఎంతో తేలిపోతుంది అంటున్నాయి పార్టీ వర్గాలు.

ప్రస్తుత పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి నుండి దిగుతున్న సందర్భంగా సాగర్ ఎన్నికల్లో గెలిపిస్తే అది తన ఖాతాలో పడుతుంది అని ఆశతో ఉన్నారు. అందుకే… తన ప్రయత్నాలు బాగానే చేశారు. ఇక మిగిలిన నాయకుల్లో అటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,రేవంత్ రెడ్డి వైపు కూడా క్యాడర్ చూస్తుంది. ఎందుకంటే. ఈ ఇద్దరు ఇంఛార్జి లుగా పని చేసిన మండలాల్లో పరిస్థితి ఏంటో తేలిపోతుంది అనే టాక్ నడుస్తుంది.

నాగార్జున సాగర్ నియోజకవర్గం లో ఉన్న మండలాల్లో గుర్రంపోడు,పెద్ద వూర కీలకంగా పని చేశయన్నది చర్చ. అయితే గుర్రంపోడు మండల కాంగ్రెస్ బాధ్యతలు చూసింది ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…పొరుగు మండలం కావడం… అక్కడ కూడా తన పలుకుబడి ఉందని వెంకట్ రెడీ ప్రచారం. పార్టీ కి కూడా ఈ మండలం నుండి… టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు తెస్తా అని మటిచ్చారట. ఎన్నికల ప్రచారం కూడా..అటు ఉత్తమ్.. కోమటిరెడ్డి కలిసి చేశారు. గుర్రంపోడు మండలం లో జానారెడ్డి కి ఎంత మెజారిటీ వస్తుంది..అందుకు కోమటిరెడ్డి పడ్డ శ్రమ ఏంటన్నది చర్చ మొదలైంది. ఇతర జిల్లాల నుండి వచ్చిన నాయకులు కూడా కోమటిరెడ్డి సొంత జిల్లా లో హవా ఎంటో బయటపడుతుంది అనే ప్రచారం వినపడింది.

ఇక మరో మండలం..పెద్దవురా. ఒకప్పుడు ఇది కాంగ్రెస్ కి కంచుకోట. ఇక్కడ టీఆర్ఎస్ తన ప్రాబల్యం పెంచుకుంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్ కె ఎక్కువ. ఇలాంటి మండలం బాధ్యతలు రేవంత్ రెడ్డి ఇంచార్జీ గా పని చేశారు. టీఆర్ఎస్ కూడా ఇక్కడ నుండే ఎక్కువ మెజారిటీ ఆశిస్తుంది. అయితే… రేవంత్ రోడ్ షో ల తో కాంగ్రెస్ కి కొంత ఊపు రావడం క్యాడర్ లో కొంత స్థైర్యాన్ని ఇచ్చింది. అయితే ఇది ఓటు గా ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది చూడాలి. రేవంత్ ఎన్నికల ప్రచారంలో జానారెడ్డి కి నేను పెద్ద కొడుకునని కొంత జనం లోకి వెళ్లగలిగాడు. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో ఓట్లు రబట్టిందా.. వన్ వే అనుకున్న ఈ మండలాల్లో టీఆర్ఎస్ ని ఎంత కట్టడి చేశారు రేవంత్ అనేది ఫలితాల్లో తేలిపోతుంది. అయితే రేవంత్ ఎన్నికల ప్రచారం కి తోడు… మండలం లో అన్ని వ్యవహారాలు ఆయనే చక్కబెట్టరాట.

ఇప్పుడు సాగర్ ఎన్నికల ఫలితాల మీద జనం కి ఎంత ఆసక్తి ఉందో… ఈ రెండు మండల్లా కాంగ్రెస్ బలం ఏంటన్న దానిపై కాంగ్రెస్ నాయకత్వం కూడా అంతే ఆసక్తితో చూస్తుంది. కోమటిరెడ్డి…రేవంత్..ఇద్దరూ పిసిసి రేసులో ఉన్నవాల్లే. అందులోనూ కోమటిరెడ్డిది సొంత జిల్లా..పొరుగు నియోజకవర్గం..వీరి బలం ఎంత అనేది మే 2 న తేలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news