కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన సీనియర్లను రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నారా..? బయటి నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టి.. పార్టీని నమ్ముకున్నవారికి హ్యాండ్ ఇస్తున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతోంది..పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించిన సీనియర్లకు రేవంత్ మొండి చెయ్యి చూపుతున్నారట..
బయటి నుంచి పార్టీలో చేరిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తుండటంపై గాంధీభవన్ వేధికగా సీనియర్లు రగిలిపోతున్నారట.. బిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయశాఖ సలహాదారుడి పదవి ఇవ్వడంపై తెలంగాణా కాంగ్రెస్ లో పెద్ద చర్చే జరుగుతోంది.. ఆయనతో పాటు.. బిజేపీ నుంచి వచ్చిన బితేందర్ రెడ్డికి డిల్లీలో రాష్త ప్రభుత్వ సలహాదారుని పదవి, బిఆర్ ఎస్ నుంచి వచ్చిన కేకేకి కూడా సలహాదారుని పోస్ట్ ఇవ్వడం కాంగ్రెస్
సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట..
పాతవారికి పదవులు ఇవ్వకుండా.. పార్టీలో చేరేవారికి పదవులు ఇచ్చుకుంటూ.. పోతే తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతలు పైర్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలు సీనియర్లు ఉన్నారని ప్రచారం జరుగుతోంది..కొత్తగా పార్టీలో చేరే బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలుగా కూడా తమకు ఏదో ఒక పదవి ఇస్తే పార్టీలో చేరుతామని చెబుతున్నారని.. ఇలా అయితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.. ఇంతలా రగిలిపోతున్న సీనియర్లను సీఎం రేవంత్ రెడ్డి ఎలా దగ్గరికి చేర్చుకుంటారో చూడాలి..