రాజ్యాంగాన్ని మార్చాల్సిందే నని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ .. రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నారా అని అన్నారు. దీనికి సమాధానంగా సీఎం కేసీఆర్ మరో సారి రాజ్యాంగం మార్చడం తమ నిర్ణయాన్ని తెలిపారు. దళితుల కోసమే తాను రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని అన్నారు.
దళితులు ఇప్పుడు 19 శాతం ఉన్నారని.. వారికి అనుగూణంగా రిజర్వేషన్లు ఉండాలని.. దానికి రాజ్యాంగం మార్చాలని అన్నారు. మహిళలపై అన్ని చట్టాలు ఉన్నా.. రక్షణ కరువు అయిందని అన్నారు. దీని కోసం రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని అన్నారు. ఇది తప్పా అని ప్రశ్నించారు. అమెరికా కన్నా.. బలమైన ఆర్థిక శక్తి ఎదగాలని రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని అన్నారు. తొటి దేశం చైనా కన్నా.. అభివృద్ధి చెందాలని రాజ్యాంగాన్ని మార్చాలని అని అన్నారు. దేశం కోసం రాజ్యాంగం మార్చుకోవచ్చని అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు.