‘చంద్రబాబు నాయుడు కి చిప్పకూడు రెడీ’

-

 

 

ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలిచిన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన మరికొన్ని వివరాలు సిట్ అధికారులు వెలికి తీస్తున్నారు. ఈ కుంభకోణం దెబ్బతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. టిడిపి నేతలపై అవినీతి ఆరోపణలతో అధికార పక్షం నేతలు దుమ్మెత్తి పోస్తూ ఉంటే తాము పలుగడిగిన ముత్యాలమని ప్రతిపక్ష నేతలు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. ఇక తాజాగా ఇదే తరహాలో ఇప్పుడు మంత్రి జయరాం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈఎస్ఐ లో బాబుతో పాటు నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పితాని సత్యనారాయణలు జైలుకు వెళ్తారు అని జోస్యం చెప్పిన ఆయన బాబు హయాంలో అక్షరాలు మూడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. అలాగే టిడిపి హయాంలో ఈ ఎస్ ఐ లో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులకు ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈఎస్ ఐ లేని షెల్ కంపెనీలు క్రియేట్ చేసి – నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందని సమాచారం. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ ఐ డైరెక్టర్లు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారట. ఈఎస్ ఐకి చెందిన రవికుమార్ – రమేష్ – విజయలు మందులు – పరికరాలను 135శాతం అధిక ధరకు టెండర్లలో చూపించారని తేలినట్లు తెలుస్తోంది. నకిలీ కొటేషన్లు – షెల్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది.

అలాగే లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ – ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు అక్రమంగా రూ.85కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిజమని తేలితే పక్క ఆధారాలతో బయటపడితే బాబు జైలుకు వెళ్ళే రోజు పెద్ద దూరంలో లేదు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news