మన’లోకం’ నిజం :  ముప్పు మానవాళికి – మానవుడికే కాదు ‘ మానవత్వానికి ‘ .. !!!

-

కరోనా వైరస్ ప్రాణాలనే కాదు మానవత్వాన్ని కూడా చంపేస్తుంది. టెక్నాలజీ వచ్చి పక్కనే ఉన్న మనిషిని మాట్లాడకుండా చేస్తే కరోనా వైరస్ ఏకంగా సొంత రక్త సంబంధాలను కూడా టచ్ చేయని స్థితిలోకి మనిషిని తీసుకెళ్ళి పోయింది. ఎదురుగా సొంత రక్త సంబంధాలు ఉన్న కరోనా వైరస్ వస్తే..ఆ వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులు చాలా దారుణంగా ప్రస్తుత సమాజంలో చూస్తున్నా ఘటనలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో అనేక మంది పేదవాళ్ళు ఆదుకున్న డాక్టర్ కి కరోనా వైరస్ సోకటం జరిగింది. దీంతో వెంటనే సదరు డాక్టర్ చెన్నై కి వెళ్లి చికిత్స తీసుకోవడం జరిగింది. కానీ కరోనా పోరుతో ప్రాణాలు విడవటం జరిగింది.Will Warming Weather Kill Off Covid-19? Scientists Aren't Sure ...డాక్టర్ వయస్సు సుమారు 55 సంవత్సరాలు. నెల్లూరు జిల్లాలో ఆర్థోపెడిక్ డాక్టర్ గా 30 ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. రాజకీయంగా మంచి పలుకుబడి, అదేవిధంగా చాలా డబ్బు ఉన్న వైద్యుడు. అయినా కానీ కరోనా వైరస్ వల్ల చనిపోవడంతో…దహన సంస్కారాలు కూడా బంధువులు, స్నేహితులు మరియు రక్త సంబంధులు చూడలేకపోయారు. కరోనా వైరస్ వల్ల చనిపోవడంతో చివరాకరికి చెన్నై నగరపాలక సంస్థ కి చెందిన కార్మికుల చేతిలో దహనసంస్కారాలు జరిగాయి. మొదటిలో అంత్యక్రియలు చేయాలని చెన్నై నగరపాలక సంస్థ సిబ్బంది తెలుగువాళ్లు ఉన్నచోట తీసుకెళ్లగా వాళ్ళు ఇక్కడ చేయకూడదు అంటూ పాలక సిబ్బందిపై కొట్టినంత పని చేశారు.

 

చివరాఖరికి పోరూరు శ్మ‌శాన వాటిక‌లో డాక్ట‌ర్‌కు అంతిమ క్రియ‌లు నిర్వ‌హించారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచ మానవాళికి, మానవుడికె కాదు మానవత్వానికి కూడా రోజులు లేకుండా చేసింది. ఎంతో డబ్బు, పలుకుబడి సమాజంలో మంచి పేరు ఉన్న ఈ వైద్యుడు ఆఖరికి…కరోనా వైరస్ వల్ల దిక్కులేని చావు…కనీసం కడ చూపు కుటుంబ సభ్యులు కూడా చూసుకోలేని చావు ఎదుర్కొనటం జరిగింది. చనిపోయిన గాని ఆ మనిషి శవాన్ని కుటుంబ సభ్యులతో పాటు సమాజం చాలా హీనంగా చూసింది. ఈ సంఘటన బట్టి చూస్తే కరోనా మనిషినే కాదు మానవత్వాని కి కూడా భూమి మీద రోజులు లేకుండా చేస్తుంది అన్ని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news