అమెరికాలో అల్ల‌క‌ల్లోలం చేస్తున్న క‌రోనా.. గంట‌కు ఎంతమంది చనిపోతున్నారంటే..??

-

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్ అమెరికాను మ‌రింత తీవ్రంగా వ‌ణికిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. ఈ క్ర‌మంలోనే రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇలా ఒకవైపు భారీగా పెరిగిపోతున్న కేసులు, వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించలేకపోవడంతో అమెరికా ఎన్నడూ చూడ‌ని సంక్షోభ పరిస్థితుల్లో విల‌విల‌లాడుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో నాలుగవ వంతు అమెరికన్లే ఉండడం గామ‌నార్హం.

ప్ర‌స్తుతం అక్క‌డ‌ ఐదు లక్షల మందికిపైగా క‌రోనాతో పోరాడుతున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే అగ్రరాజ్యంలో అత్యధిక ప్రాణ నష్టం వాటిల్లుతోంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అమెరికా గురించి మ‌రిన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు నిన్న రాత్రి సమయానికి అమెరికాలో దాదాపు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయార‌ట‌.

అలాగే ప్రతి గంటకు సుమారు 83 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపింది. దీంతో ప్ర‌జ‌లు అర‌చేతిలో ప్రాణాలు పెట్టుకుని బ‌తుకుతున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా యాబై రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. మ‌రియు 50 వేల మంది సైన్యాన్ని కరోనా పోరాటంలో విధులను నిర్వ‌హిస్తున్నారు. అయితే మ‌రోవైపు కరోనా వ్యాప్తి గురించి అమెరికా అధికారులు ముందుగానే హెచ్చరించినా ట్రంప్ పట్టించులేదని.. కేవలం ఆర్థిక వ్యవస్థపైనే దృష్టి పెట్ట‌డం వల్ల‌ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news