దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పొత్తు నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.జనసేన పార్టీతో పొత్తు ఏర్పడటం మంచిదని చెప్తూనే టీడీపీ చేరికపై నిరాశక్తి వ్యక్తపరిచారు.దేశంలో అరాచక శక్తులు ఎక్కువ అయ్యాయని,ఇలాంటి సమయంలో లోకల్ పార్టీలు బీజేపీతో చేరడం శుభపరిణామం అన్నారు. శిష్ట రక్షణ కోసం అందరూ కలవాలని ఆమె పిలుపునిచ్చారు. సీట్ల విషయంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుతో కలిసినప్పుడే బీజేపీ విలువ పడిపోయిందని పురందేశ్వరి వ్యాఖ్యలకు సెటైర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు.ఆమె దృష్టిలో దుష్టులు ఎవరో శిష్టులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని అటు టీడీపీ నేతలు కూడా గుసగుసలాడుతున్నారు.కొందరైతే బీజేపీతో పొత్తు వలన టీడీపీకి నష్టమే ఉంటుందని కేడర్ వద్ద ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారాలకు దూరమవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ఈ పరిణామాలు కూటమిలోని పార్టీలకు తలనొప్పిగా మారనున్నాయి. పురందేశ్వరి వ్యాఖ్యలు అర్థరహితమని మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి టీడీపీతో పొత్తు అటు బీజేపీ నేతలకే ఇష్టం లేదనేది అర్థమవుతోంది.పొత్తుపై అయిష్టత వ్యక్తపరుస్తూనే ఎన్నికల ప్రచారాలకు సిద్ధమయ్యారు ఆమె.మేనిఫెస్టో రూపకల్పనపై అభిప్రాయ సేకరణ కూడా చేపట్టనున్నారు. ఇందుకోసం 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపుతున్నారు.
పొత్తులు కుదిరిన నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు ఈ నేక 17న తలపెట్టిన సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభలో మోడీ పాల్గొంటారని అంటున్నారు.మరోవైపు ఈ సభ కోసం ఏపీ బీజేపీ నేతలకు కూడా ఆహ్వానాలు పంపుతున్నారు టీడీపీ నేతలు. 17న ప్రధాని మోదీ బిజీగా ఉంటే ఆయన రాక కోసం సభను వాయిదా వేసే ఆలోచనలో టీడీపీ ఉంది.బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.మరి ఈ సభలో పురందేశ్వరి ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.