‘దళిత బంధు’ డబ్బులు వెనక్కి.. టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళిత బంధు’ స్కీమ్ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో లాంచ్ చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వచ్చి పథకాన్ని ప్రారంభించారు. ఇకపోతే టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థి అయిన విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ‘దళిత బంధు’ స్కీమ్ ద్వారా హుజురాబాద్‌లో గట్టెక్కాలనేది పింక్ పార్టీ ప్లాన్. కాగా, ప్రజెంట్ ఆ స్కీమ్ కింద ఇచ్చిన డబ్బులు వెనక్కి పోతున్నాయట.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఇందుకు గల కారణమేమిటంటే.. నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమేనని, ఎన్ని పథకాలు, అస్త్రాలు ప్రయోగించినా ఈటల రాజేందర్‌కు ఉన్న ఆదరణ తగ్గడం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు కేసీఆర్‌కు రిపోర్ట్ చేశాయని తెలుస్తోంది. ఇక ఎన్నికలు ఆలస్యమయ్యే చాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలకు ముందరనే పైసలు జమ చేస్తే బాగుంటుందని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అలా చేస్తేనే ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని గులాబీ శ్రేణుల్లో చర్చ ఉన్నది. ఈ క్రమంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డ సొమ్మును టీఆర్ఎస్ సర్కారు వెనక్కి తీసుకుంటున్నదనే వార్తలు వస్తున్నాయి.
నిరుపేదలు, ఒంటరి మహిళలు, వృద్ధాప్యంలో ఉన్న మహిళల అకౌంట్స్ నుంచి డబ్బులు ఆల్రెడీ వాపస్ పోయినట్లు సమాచారం. నియోజకవర్గంలో అధికారుల సర్వే ప్రకారం 20,900 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేలింది. వీరికి ‘దళిత బంధు’ స్కీమ్‌లో భాగంగా ‘దళిత బంధు రక్షణ నిధి’ కింద రూ. పది వేలు ఉంచి, మిగతా 9.90 లక్షలను ప్రత్యేక అకౌంట్‌లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 14 వేల 400 మందికి డబ్బులు వేసినట్లు తెలుస్తుండగా, 156 మంది ఖాతాల నుంచి డబ్బు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉంటుందని హుజురాబాద్ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు హుజురాబాద్ బరిలో నిలపబోయే అభ్యర్థిని ప్రకటించలేదు.