దళిత ప్రశ్నలు: కనిపిస్తున్న 10లక్షలు – కనిపించని పదిహామీలు!  

దళిత ప్రశ్నలు: రాజకీయ నాయకులు ఎప్పుడైతే తాత్కాలిక ప్రయోజనాలపై దృష్టిపెడతారో.. ప్రజలు ఎప్పుడైతే శాస్వత ప్రయోజనాల గురించి ఆలోచించడం మానేస్తారో.. అప్పుడే సోకాల్డ్ రాజకీయా పార్టీల మనుగడ నిరాటంకంగా సాగిపోతుంటుంది. వెనుకబడిన ప్రజల బ్రతుకులలో మార్పులు కనుమరుగవుతుంటాయి. ఈ విషయం గ్రహించడంలో నిత్యం విఫలమవుతున్నారనే కామెంట్లు సంపాదించుకున్న దళితులు – వెనుకబడిన సామాజికవర్గాల ప్రజలు గ్రహించాల్సిన విషయాలు స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు!

cm kcr | సీఎం కేసీఆర్

cm kcr | సీఎం

కేసీఆర్ తెలంగాణలోదళితులు చాలా వెనుకబడిపోయారని చెబుతున్న కేసీఆర్… దళితబంధు పథకం అందుకు పెద్ద పరిష్కారం అని చెప్పే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే.. ఇది చాలా తాత్కాలికమైన సాయం.. సాధికారత కానేకాదనేదీ నగ్న సత్యం అంటున్నారు మేధావులు! ఇందులో భాగంగా… కేసీఆర్ దళితబంధు 10లక్షల మాటున.. శాస్వత ప్రయోజనాలిచ్చే 10 హామీలు మరుగునపడిపోతున్నాయి!

  1. అవును… దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ హామీ మరుగునపడిపోయింది. ఆ స్థానంలో 10లక్షలు వచ్చి చేరింది. ఎన్ని పదిలక్షలు పెడితే… దళితులకు మూడెకరలా భూమి వస్తుంది? ప్రస్తుతం తెలంగాణలో పెరిగిన భూమి ధరల నేపథ్యంలో… శాస్వతంగా ఉండే మూడెకరాల భూమి కావాలా? – తాత్కాలిక ఉపశమనంగా మిగిలే 10లక్షలు కావాలా? దళితులు ఆలోచించుకోవాలి! అనేది దళిత మేధావులు చెబుతున్న మాట!
  2. కేజీ టు పీజీ అనే మరోపథకం కూడా ఈ దళితబంధు పేరున మరుగునపడిపోతుంది! దళిత కుటుంబాలకు 10లక్షలు ఇవ్వడం ముఖ్యమా – దళిత బిడ్డలు అధికంగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన విద్యను అందిస్తే… పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటే… వాళ్లే కోట్లు సంపాదించుకుంటారు. అప్పుడు ఈ పదిలక్షలు ఎంత? 4000 కోట్లతో మొదలుపెడతామన్న “తెలంగాణ: నాడు – నేడు” పథకం ఏమైంది? ఇది మేధావులు అడుగుతున్న మరో ప్రశ్న!
  3. ఐటీ కంపెన్నీలో దళిత బిడ్డలకు అవకాశాలు కల్పించే ఆలోచన ఏమైంది? ఇంజినీరింగ్ చదువుతున్న కాలేజీలలో దళితబిడ్డలను గుర్తించడం.. ప్రముఖ ఐటీ కంపెనీలతో ప్రభుత్వం టైఅప్ అవ్వడం.. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వడం.. ఫలితంగా ప్లేస్ మెంట్ ఇప్పించడం వల్ల.. ఆ కుటుంబాలు 10లక్షలు కాదు.. కోట్లు సంపాదించుకుంటుంది కదా? ఇది మరో ప్రశ్న!
  4. నిరుద్యోగ భృతి ఏమైనట్లు అనేది మరో ప్రశ్న! తెలంగాణ ఏర్పడింది.. ప్రభుత్వాల పాలన నిరాటంకంగా సాగుతుంది. కానీ నిరుద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు ఆ భృతి మాత్రం అందడం లేదు! 10లక్షల మాటున అదీ కనుమరుగవుతున్నట్లే లెక్కా..? ఇది ఇంకో ప్రశ్నగా ఉంది!
  5. 2020డిశెంబరులో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో… వరద బాధితులకు 10వేల సాయం ఏమైంది.. మరో పదివేలు ఇస్తామన్న మాటలు ఏమయ్యాయి? వరదలవల్ల నష్టపోయిన దళిత కుటుంబాలు అడుగుతున్న ప్రశ్న ఇది!
  6. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న పెద్దల మాటలు ఏమయ్యాయి.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మాటలు నీటిమీద రాతలైపోయాయా? కేసీఆర్ చెప్పినట్లు, హామీ ఇచ్చినట్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిస్తే.. ఇప్పటికే ఎన్నో దళిత కుటుంబాలు పదిలక్షల కంటే ఎక్కువ సంపాదించుకుని ఉండేవి కావా? ఇది వారడుగుతున్న మరో ప్రశ్న!
  7. నిజాం ఆసుపత్రికి సంబందించిన రెండు టవర్ల కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి ఏమైంది? ఆర్థికంగా వెనుకబడిన వారి ఆరోగ్యానికి ఆసరాగా ఉన్న ఆ ఆసుపత్రి హామీ ఏమైంది? ఇది ఇంకో ప్రశ్న!
  8. తెలంగాణ వస్తే… ప్రతీకుటుంబానికీ ఉద్యోగం అన్న హామీ ఏమైంది. అదే జరిగితే నేడు ఈ బాదలెందుకు.. ఆ పదిలక్షల కోసం చేతులు చాపడం ఎందుకు? నోటిఫికేషన్లు లేవు.. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలేదు? ఈ నిర్లక్ష్యం ఎందుకు
  9. ఇదేసమయంలో పోడు భూముల సమస్యపై కేసీఆర్ హామీ ఏమైపోయింది?
  10. తెలంగాణ రాగానే దళితుడే ముఖ్యమంత్రి అన్న హామీ ఏది? కనీసం కేసీఆర్ కేబినెట్ లో దళితులకున్న ప్రాధాన్యత ఎంత? కేసీఆర్ కేబినెట్ లో ఉన్న దళిత మంత్రులు ఎంతమంది? ఇంకెంత కాలం ఇలా? సుమారు 80శాతానికిపైగా ఉన్న బహుజనులకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత ఇదేనా?

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగ్మా దళిత మేధావులు – విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్నలు ఇవి! మరి ఈ ప్రశ్నలకు కేసీఆర్ సర్కార్ వద్ద సమాధానాలు ఉన్నాయా? దళితబంధు అద్భుతః అంటున్న నాయకులు, మేధావులు… ఆ పదిలక్షల హామీ మరుగున పడిన పది హామీల సంగతి లెక్కలేదంటారా? తాత్కాలిక ప్రయోజనాలకు దళితులను ఇంకా బానిసబ్రతుకులకే పరిమితం అవ్వమంటారా? శాస్వత ప్రయోజనాలు చేకూర్చే పనులు ప్రభుత్వాలు చేయవద్దంటారా? ఇవన్నీ దళితలోకం సంధిస్తున్న ప్రశ్నలు!.. ఎప్పటికీ సమాధానాలు దొరకని ప్రశ్నలు..! కనిపిస్తున్న 10లక్షలు మాటున కనిపించని పదిహామీలు!!మరుగునపడిన శాస్వత పరిష్కారాలు!!

– CH Raja