హుజూరాబాద్ ఉపఎన్నిక పుణ్యామాని ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దళితుల నామస్మరణ విపరీతంగా పెరిగిపోతుంది! అన్ని రాజకీయ పార్టీలకు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చేసింది.. దళితోద్దరణే అందరికీ ముఖ్యమైపోయింది! ఇందులో భాగంగా అధికారంలో ఉండటంతో.. ఒక అడుగు ముందుకేసారు కేసీఆర్. ఫలితంగా.. “దళిత బంధు” పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే… ఈ దళిత బంధుపై బహుజన మేధావులు, విశ్లేషకుల విశ్లేషణలు ఇప్పుడు చూద్దాం!
ఎన్నికల వేల ఏసే “ఎర”గా దళితోద్దరణ ఉండకూడదనేది మేధావుల మాటగా ఉంది. దళితులు చాలా వెనకబడిపోయారని ఇప్పుడు చెబుతున్న నేతలకు.. తెలంగాణ వచ్చి ఏడేళ్లైన తర్వాత గుర్తుకురావడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. అయినా పర్లేదు.. “లేట్ బెటర్ దేన్ నెవ్వర్” అని సరిపెట్టుకోవచ్చంటున్నారు. అయితే… ఈ సందర్భంగా… “ఎన్నికల సమయాల్లో మాత్రమే దళితుల కోసం అంటూ పథకాలు ప్రకటించేసి ఆ తరువాత వాటి ఊసెత్తకుండా ఉండకూడదు” అని సూచిస్తున్నారు.
తాజాగా జరిగిన మీటింగ్ లో స్పందించిన కేసీఆర్… “దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారంటూ” తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాలపై కూడా దళిత మేధావులు స్పందిస్తున్నారు. కేసీఆర్ గురించి ఎవరూ అలా భావించడం లేదని… ఆ మాట నిజం చేసుకోవాలంటే కేసీఆర్ ఇప్పటివరకూ దళితులకు ఇచ్చిన వాగ్ధానాలు నరవేర్చాలని సూచిస్తున్నారు.
కనీసం దళితులకు మూడెకరాల భూమి పథకాన్నైనా 100శాతం పూర్తిచేసిఉన్నా కూడా ఇప్పుడు చెబుతున్న మాటలను ఎంతోకొంత నమ్మేవారే! కానీ.. ఆ అవకాశాన్ని కూడా కేసీఆర్ చేజార్చుకున్నారు! ఇప్పటివరకూ ఆ పథకాన్ని కనీసం ప్రారంభం చెయ్యలేదనేది వారి వాదన. ఫలితంగా.. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ దళిత ప్రేమను నమ్మేదెట్లా? అనేది వారి ప్రశ్నగా ఉంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అంటూ చేసిన ప్రకటనకు దిక్కూ లేదు, అసలు ఎందుకని ఇంత ఆలస్యం చేస్తున్నారో అర్థం కావటంలేదంటూ సొంత పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డ్ గుస గుసలాడుతున్నారు.
దళితుల జీవితంలో పెను మార్పులు తీసుకురావాలంటే… అది 10లక్షలో ఇరవైలక్షలో పంచితే అయ్యేది కాదని.. అణగారిన వర్గాలకు అందుబాటులోనేని కార్పొరేట్ స్థాయి విద్యావకాశాలు కల్పించడం.. వారికి అందని ద్రాక్షగా ఉన్న రంగాల్లో అవకాశాలు కల్పించడం.. దళిత హాస్టల్స్ లో సౌకర్యాలు మెరుగుపరచడం, డబ్బు రూపంలో ఇచ్చేదానికంటే కూడా ఒక పరిశ్రమ నెలకొల్పడం వంటివి కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు మేధావులు!
ఈ సందర్భంగా… తెలంగాణ ప్రభుత్వంలో ఏయే సామాజికవర్గాలకు ఎన్ని పదవులు ఇచ్చారో లెక్కలు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు మరికొందరు నేతలు! కేసీఆర్ దళిత ప్రేమను.. కొంగజపం లా వారు నిర్వచిస్తున్నారు!
ఏది ఏమైనా… కేసీఆర్ కు ఇంకా సమయం ఉంది.. మించిపోలేదు! ఇప్పటికైనా దళితోద్దరణపైన నిజాయితీతోకూడిన శ్రద్ధ పెడితే.. కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప.. ఇలాంటి తాయిలాల వల్ల నో యూజ్! ఇలాంటి విషయాలను దళితులు నమ్మినంతకాలం “తాత్కాలిక ఆనందాలే మిగులుతాయి తప్ప.. శాస్వతమైన సంతోషాలు లభించవు.. రాబోయే తరాలకూ ఇబ్బందులు తప్పవు.. ఎప్పటీకీ అంబేద్కర్ ఆశయాలు నెరవేరవు”!! అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!