బిజెపిలో బిఆర్ఎస్ విలీనం.. తెలంగాణలో జరుగుతున్న తాజా చర్చ ఇదే

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ అష్ట కష్టాలు పడుతోంది.. ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్ళింది.. పార్టీ ఎమ్మెల్యేలు సైతం చేజారిపోతున్నారు.. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు.. తమని తాము రక్షించుకునేందుకు.. టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని ప్రచారం జరుగుతుంది.. టిఆర్ఎస్ పార్టీ బిజెపిలో విలీనం అయ్యేందుకు చర్చలు జరుగుతున్నాయని టాక్ తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇంతవరకు స్పందించలేదు..

బిఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్న కేటీఆర్ హరీష్ రావు విలీన అంశంపై ఇంతవరకు నోరు మెదపలేదు.. కనీసం బలంగా ఖండించిన సందర్భాలు కూడా లేవు.. ఈ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే.. వారిద్దరూ ఇటీవల ఢిల్లీ టూర్కు వెళ్లారు.. అక్కడ ఈ వారం పాటు మకాంవేశారు. అయితే వారు ఎవరిని కలిశారు ఎవరితో సమావేశమయ్యారు.. అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.. వీళ్ళిద్దర ఢిల్లీ టూర్ పై సీఎం రేవంత్ రెడ్డి సైతం సెటైర్లు పేల్చారు.. పార్టీని తాకట్టు పెట్టేందుకే వాళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్లారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.. ఈ విమర్శలపై కూడా పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. పలు అనుమానాలకి తావిస్తోందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది..

బిజెపి బీఆర్ఎస్ మధ్య విలీన చర్చలు జరగకపోతే.. దాన్ని ఆ రెండు పార్టీలు ఖండించాలి కదా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.. ఈ విషయంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు చెందిన ఏ ఒక్క నేత కూడా మీడియ ముందుకు రావడం లేదు. కేటీఆర్ కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో.. నిప్పు లేకుండా పొగ రాదు కదా అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ ని విలీనం చేసుకునేందుకు.. తెలంగాణ బిజెపి నేతల్లో ఏకాభిప్రాయం రాలేదని ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది.

బిఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే బీజేపీకే నష్టమని.. కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట. దీంతో కేంద్రంలోని కమలనాధులు సైతం డైలమాలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.. ఈ వ్యవహారంలో రెండు పార్టీలు ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news