సిద్ధమైన ‘ఆప్’ విజయరథం.. సవారీకి బ‌య‌లుదేర‌నున్న కేజ్రీ..!!

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొద‌లైంది. భారీ భద్రత మధ్య, ఈవీఎంలు తెరచుకోనున్నాయి. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. కౌంటింగ్ ప్రారంభించిన గంట వ్యవధిలో ట్రెండ్స్ తెలుస్తాయి. రెండు గంటల వ్యవధిలోనే అధికారం ఎవరిదో క్లారిటీ రానుంది. అలాగే మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఇవాళ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఇక మరోసారి హస్తినలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంచనాలు నిజముతున్నాయి.

మెజారిటీ స్థానలో ఆప్ అభ్యర్దుల హవా నడుస్తోంది. ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ‘ఆప్’ హవా కనిపిస్తోంది. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో చిందులు వేస్తున్నారు. మరోవైపు రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఓపెన్ టాప్ జీప్ సిద్ధం చేశారు. దానిని అందంగా అలంకరించారు. ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఆధిక్యంలో దూసుకువెళుతున్నారు. కొద్దిసేపటిలో ‘ఆప్’ విజయరథంలో కేజ్రీవాల్ పర్యటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news