వారం రోజుల్లో కరోనా కంట్రోల్ చేస్తా: సిఎం

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వారం రోజుల్లో కరోనాను కంట్రోల్ చేస్తామని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరగడానికి కాలుష్యం కూడా ఒక కారణం అని ఆయన అన్నారు. రాబోయే వారం పది రోజుల్లో కరోనాను కట్టడి చేస్తామని అన్నారు. “కేసుల సంఖ్య పెరగడం గురించి నేను కూడా ఆందోళన చెందుతున్నాను. మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము” అని ఆయన పేర్కొన్నారు.

ఏడు నుండి 10 రోజులలో, కేసుల సంఖ్య తగ్గుతుంది అని పరిస్థితి అదుపులోకి రావాలని నేను ఆశిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ లో ఒక్క రోజే 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కరోనా మూడో వేవ్ ఉంది. శీతాకాలంలో రోజుకు 15 వేల వరకు కేసుల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది అని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది.