మోడీషాలకు దిమ్మ తిరిగిపోయిందిగా…?

-

ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఆప్ గెలుస్తుంది గాని 50 స్థానాలు వస్తాయని చెప్పాయి. కాని ఇక్కడ ఫలితం మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలకు కూడా అందలేదు. 63 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. 70 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆప్ 80 శాతం గెలిచింది. ఊహించని విధంగా జయకేతనం ఎగురవేసింది ఆ పార్టీ. 5 ఏళ్ళుగా అరవింద్ కేజ్రివాల్ నిర్ణయాలను ఎంత తప్పుబడుతూ బిజెపి ప్రచారం చేసినా సరే ప్రజలు మాత్రం ఆప్ కి అండగా నిలిచారు ఢిల్లీలో.

ఏకపక్ష విజయం ఇచ్చారు ఆ పార్టీకి, ఢిల్లీ నలుమూలలా, ఆల్ బౌండరీస్ ని కేజ్రివాల్ పార్టీ కవర్ చేసింది. బిజెపి గెలిచిన నియోజకవర్గాల్లో కూడా పెద్దగా స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండా పోయింది. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు. వారికి కేజ్రివాల్ పరిపాలన చాలా దగ్గరైంది. ఆయన తీసుకునే నిర్ణయాలు వారికి నచ్చాయి.

ఇక జాతీయ వాదం అంటూ చేసింది ఏమీ లేకపోయినా బిజెపి కొట్టిన డప్పు చిరాకు పుట్టించింది ఢిల్లీ ప్రజలకు అంటున్నారు. అందుకే అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఏకపక్ష విజయం సాధించారని అంటున్నారు. దీనిపై కేజ్రివాల్ హర్షం వ్యక్తం చేసారు. ఇది ఢిల్లీ ప్రజల ప్రతీ కుటుంబ విజయమని అన్నారు. ఢిల్లీ తన కుమారుడిని నమ్మి మళ్ళీ గెలిపించింది అన్నారు ఆయన. అభివృద్దికి ఓటు వేసారని వ్యాఖ్యానించారు.

సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించాయని అన్నారు. ఇక ఇప్పుడు బిజెపి ఆలోచించుకోవాలి. ఇన్నాళ్ళు తాము చెప్పిన కబుర్లకు కాలం చెల్లింది అనే విషయాన్ని మోడీ షా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేశ ప్రజలు మతం మీద ఆధారపడే పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి రాజకీయాలు చేసే పార్టీలు అన్నీ ఆలోచించాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Read more RELATED
Recommended to you

Latest news