విద్యుత్ సంక్షోభం దిశగా ఢిల్లీ.. ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ

దేశంలో విద్యుత్ సంక్షోభం భయాలు నెలకొన్నాయి. నిన్న విద్యుత్ సంక్షోభం, బొగ్గు కొరతపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయగా తాాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. విద్యుత్ కేంద్రాల్లో ఒకే రోజుకు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ ప్లాంట్లకు వెంటనే బొగ్గు, గ్యాస్ ను అందించాలని లేఖలో కోరారు. బహిరంగ మార్కెట్ లో యూనిట్ కు రూ. 20 వసూలు చేస్తున్నారని ధరలు నియంత్రించాలని లేఖలో ప్రధానిని కోరారు. విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సాధ్యమైనంతగా పనిచేస్తున్నట్లు లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

 దేశంలో అడుగంటుతున్న బొగ్గు నిల్వల కారణంగా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడేంత బొగ్గు నిల్వలు అందుబాటులో లేవని తేలుస్తోంది. కరోనా అనంతరం ఇండస్ట్రియల్ సెక్టార్ ఉత్పత్తి పెరుగుదల కారణంగా విద్యుత్ కు డిమాండ్ ఏర్పడింది. దీంతో డిమాండ్ కు సరిపడా సరఫరా లేకపోవడంతో సంక్షోభం తలెత్తే అవకాశం ఏర్పడింది.