అదేంటో గానీ ఏ జాతీయ పార్టీలో రాష్ట్రానికి ఒక అధ్యక్షుడిని నియమిస్తే మిగతా వారంతా కచ్చితంగా సపోర్టు చేస్తారు. అంతే కాదు ఆయనకు అండగా నిలుస్తూ అధికార పార్టీపై విరుచుకుపడతారు. కానీ కాంగ్రస్‌లో మాత్రం ఇవన్నీ కాస్త డిఫరెంట్. రేవంత్‌రెడ్డి revanth reddy ని టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటిస్తే మిగతా వారంతా వ్యతిరేకించారు. ఇంకొందరైతే ఏకంగా రాజీనామాల దాకా వెళ్లారు.
కాగా రేవంత్ రెడ్డి నియామకం విషయంలో కొందరు సీనియర్ నేతలు ముందు నుంచి ఫైర్ అవుతున్నా అధిష్టానం వార్నింగ్ తర్వాత చల్లబడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు పలువురు కీలక నేతలను ఢిల్లీ అధిష్టానం హెచ్చరించడంతో వారంతా సైలెంట్ అవుతున్నారు.
ముందు నుంచి రేవంత్‌ను వ్యతిరేకించిన జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు లాంటి కీలక నేతలను కూడా అధిష్టానం సీరియస్ గా హెచ్చరించడంతో సైలెంట్ అవుతున్నట్టు సమాచారం. మారుతున్నారు. అయితే వారంతా ఇప్పట్లో రేవంత్‌కు ఒకేసారి అండగా నిలవకపోయినా.. భవిష్యత్‌లో అండగా ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి అధిష్టానం రేవంత్‌కు బాగానే సపోర్టు చేస్తోంది.