బ్రేకింగ్; ఢిల్లీ అల్లర్లలో బిజెపి దొరికిపోయిందా…?

-

దేశ రాజధాని ఢిల్లీ పౌరసత్వ అల్లర్లపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్‌.మురళీధర్‌ను రాత్రికి రాత్రే కేంద్రం బదిలీ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు జడ్జిగా బదిలీచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వ్యులు ఇచ్చింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ని కేంద్ర న్యాయశాఖ విడుదల చేయడం గమనార్హం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 222 క్లాస్ 1 ప్రకారం సీజేఐతో చర్చించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు జడ్జి మురళీధర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బదిలీ చేశారని పేర్కొంది.

ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం మురళీధర్‌ను బదిలీచేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈశాన్య ఢిల్లీ లో జరుగుతున్న హింసపై విచారణ సందర్భంగా బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేసిన నలుగురు బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ, ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.

అదే విధంగా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంకా ఎంతమంది చనిపోవాలి. ఇంకా ఎన్ని ఇళ్లు దహనమైపోవాలి. 1984 లాంటి సిక్కు అల్లర్ల పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆయన్ను రాత్రికి రాత్రి కేంద్రం బదిలీ చేసిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. పలువురు విపక్షాల నేతలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేసారు. కాగా ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news