జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌..

తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఆ పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి దేవినేని అవినాశ్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అవినాశ్ తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాశ్‌తో పాటు సీనియర్ నేత కడియాల బచ్చిబాబు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అయితే దేవినేని అవినాష్‌ గురువారం(నేడు) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో కలిశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారిద్దరికీ ముఖ్యమంత్రి… కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్ర‌మంలోనే అవినాష్ మాట్లాడుతూ.. తన తండ్రి మీద ఉన్న అభిమానంతో తనను కొడుకులా వైసీపీ దగ్గరకు తీసుకుంద‌ని.. పదవులు ఆశించి పార్టీలోకి రాలేద‌ని ఆయ‌న అన్నారు. అలాగే జగన్ నాయకత్వంలో సైనికుల్లా క‌ష్ట‌ప‌డి ప్ర‌జ‌ల కోసం పని చేస్తాన‌ని అవినాష్ అన్నారు.