రఘురాం రాజన్ చెప్పిన లాజిక్ .. మోడి పట్టించుకుంటాడా ?

-

దేశంలో ఉన్న కొద్ది కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అన్న సందిగ్దంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. చాలావరకూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ ఇంకా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరోపక్క ఆర్థికమాంద్యం తీవ్రంగా దెబ్బతినడంతో ఇంకా లాక్‌డౌన్ కొనసాగిస్తే ఎటువంటి పరిణామాలు దేశంలో చోటు చేసుకుంటాయో అన్న భయాందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదే టైమ్ లో  లాక్‌డౌన్ అయితే వైరస్ విజృంభిస్తే భారత్ మరో ఇటలీ మరియు స్పెయిన్ అయ్యే అవకాశం ఉందని అంతకన్నా ప్రమాదకరంగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.PMO's Secrecy on Raghuram Rajan Letter Is 'Not Legal', Says CICఇటువంటి నేపథ్యంలో మాజీ ఆర్.బి.ఐ గవర్నర్ రఘురామ్‌ రాజన్ లాక్‌డౌన్ విషయంలో మోడీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు తెలియజేశారు. అదేమిటంటే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నచోట లాక్‌డౌన్ ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాకుండా పరిస్థితి ఎంత గడ్డుగా ఉన్నా.. నిరుపేదల పట్ల ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

పేదలను మానవత్వంతో వారిని ఆదుకోవడం ప్రభుత్వాల విధి అని రాజన్ సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించాలి అని, త్వరగా వ్యవస్థను గాడిలో పెట్టాలని రఘురామ్ రాజన్ తెలిపారు. మరి రఘురామరాజు…వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నచోట పనులు ప్రారంభించాలని చెప్పినా లాజిక్ మోడీ పట్టుకుంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news